రజనీకాంత్ యూఎస్ ఫొటోస్ లీక్.. ఆనందంలో అభిమానులు
Super Star Rajinikanth USA photos leak.సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే.
By తోట వంశీ కుమార్ Published on
27 Jun 2021 6:25 AM GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉండడంతో ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని వైద్య పరీక్షల కోసమే అమెరికా వెళ్లారని తెలిసి ఆయన అభిమానులు కాస్త కంగారు పడ్డారు. ప్రస్తుతం రజనీకాంత్ ఎలా ఉన్నారోనని అభిమానుల్లో కాస్త టెన్షన్ సైతం నెలకొంది. అయితే.. తలైవా పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ సూపర్ జోష్‌లో ఉన్నారని రెండు ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి.
ఒకటి అమెరికాలోని ప్రముఖ ఆస్పత్రి నుంచి తన కుమార్తె ఐశ్వర్యా ధనుష్‌తో కలిసి రజనీ నడుచుకుంటూ వస్తున్న ఫొటో కాగా.. మరోటి లోకల్ ట్రైన్‌లో గాగుల్స్ పెట్టుకుని, స్టయిల్‌గా ప్రయాణిస్తున్న ఫొటో. ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పిక్స్ చూసి రజనీకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని అంటున్నారు. జూలై 8న రజనీకాంత్ ఇండియాకి రానున్నట్టు తెలుస్తుంది. ఇక ఆయన నటించిన తాజా చిత్రం 'అన్నాత్తే' నవంబర్ 4న విడుదల కానుంది.
Next Story