లోక‌నాయ‌కుడు ఆరోగ్యంపై సూప‌ర్ స్టార్ ఆరా

Super star Rajinikanth enquires about Kamal Haasans Health.లోకనాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Nov 2021 1:25 PM IST
లోక‌నాయ‌కుడు ఆరోగ్యంపై సూప‌ర్ స్టార్ ఆరా

లోకనాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న చెన్నైలోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉందని ఆస్ప‌త్రి వ‌ర్గాలు తెలిపాయి. క‌మ‌ల్ ఆరోగ్య ప‌రిస్థితిపై సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ఆరా తీశారు. స్వ‌యంగా ర‌జ‌నీకాంత్.. క‌మ‌ల్ హాస‌న్‌కు ఫోన్ చేసి ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆరోగ్యం ఎలా ఉంద‌నే విష‌యాన్ని అడిగితెలుసుకున్నారు. కాగా.. సినీ ఇండస్ట్రీలో లోక‌నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్‌, సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ఇద్ద‌రూ మంచి స్నేహితులు అన్న సంగ‌తి తెలిసిందే.

మ‌రో వైపు క‌మ‌ల్ హాస‌న్ ఆరోగ్య ప‌రిస్థితిపై ఆయ‌న కుమారై శృతిహాస‌న్ నిన్న‌ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ కృతజ్ఞతలని, కమల్ కోలుకుంటున్నారని ట్వీట్ చేశారు.

ఇటీవ‌ల 'విక్ర‌మ్' సినిమా షూటింగ్ కోసం యూర‌ప్‌ వెళ్లి వ‌చ్చారు క‌మ‌ల్ హాస‌న్‌. ఆ స‌మ‌యంలో ద‌గ్గు రాగా.. క‌రోనా టెస్టు చేయించుకున్నారు. పాజిటివ్ రావ‌డంతో సెల్ప్ ఐసోలేష‌న్‌లోకి వెళ్లారు. త‌రువాత వైద్యుల సూచ‌న‌ల‌తో ఆస్ప‌త్రిలో చేరారు. ఈ విష‌యాన్ని క‌మ‌ల్ సోష‌ల్ మీడియా ద్వారా స్వ‌యంగా వెల్ల‌డించారు.

Next Story