ఎన్టీఆర్‌కు మహేష్ ట్వీట్.. గెట్ వెల్ సూన్ బ్రదర్ అంటూ..

Super star Mahesh babu wishes NTR a speedy recovery.యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌రోనా బారిన సంగ‌తి తెలిసిందే.ఎన్టీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాలంటూ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఆకాంక్షించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 May 2021 8:51 AM IST
mahesh

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌రోనా బారిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు క‌రోనా సోకిన విష‌యాన్ని ఎన్టీఆర్ సోష‌ల్ మీడియా ద్వారా స్వ‌యంగా వెల్ల‌డించ‌డంతో.. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానుల‌తో పాటు ప‌లువురు సెల‌బ్రెటీలు ప్రార్థిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎన్టీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాలంటూ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఆకాంక్షించారు. గెట్ వెల్ సూన్ బ్రదర్.. స్ట్రెంత్ అండ్ ప్రేయర్స్ష అని ట్వీట్ చేశారు. ఎన్టీఆర్‌- మ‌హేష్ మంచి స్నేహితులు కాగా.. ఆ మ‌ధ్య మ‌హేష్ న‌టించిన 'భ‌ర‌త్ అనే నేను' సినిమా ఆడియో వేడుక‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా వెళ్లిన విష‌యం తెలిసిందే. అంతేకాదు ప‌లు సంద‌ర్భాల‌లో వీరు క‌లిసి పార్టీలు కూడా జ‌రుపుకున్నారు.


ఇదిలా ఉంటే.. మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇటీవ‌లే తొలి షెడ్యూల్ ను దుబాయ్ లో స‌క్సెస్ పుల్‌గా కంప్లీట్ చేసుకుంది. క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా షూటింగ్ వాయిదా ప‌డింది. ఇక ఎన్టీఆర్..రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్ఆర్ఆర్ లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కూడా క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో పాటు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.


Next Story