ఎన్టీఆర్‌ షో కి గెస్ట్‌గా సూప‌ర్‌స్టార్..!

Super star Mahesh Babu to appear in Evaru Meelo Koteeshwarulu.వెండితెర‌పైనే కాకుండా బుల్లితెర‌పై కూడా యంగ్ టైగ‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Sep 2021 9:11 AM GMT
ఎన్టీఆర్‌ షో కి గెస్ట్‌గా సూప‌ర్‌స్టార్..!

వెండితెర‌పైనే కాకుండా బుల్లితెర‌పై కూడా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌త్తా చాటుతున్నారు. ఆయ‌న హోస్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షోకు మంచి టీఆర్‌పీ రేటింగ్ వ‌స్తోంది. ఈ షో కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా వచ్చి అలరించారు. ఆ ఎపిసోడ్ హయ్యెస్ట్ టీఆర్‌పీ సాధించింది. తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ఈ షోకు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రాబోతున్నారు. ఎన్టీఆర్‌తో క‌లిసి మ‌హేష్ గేమ్ ఆడ‌బోతున్నార‌ని తెలుస్తోంది.

దసరా స్పెషల్‌గా ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ చెయ్యబోతున్నార‌ని వినిపిస్తోంది. ఆదివారం (సెప్టెంబర్ 19)న దీనికి సంబంధించిన షూటింగ్‌లో మహేష్ పాల్గొనబోతున్నారని సమాచారం. పండుగ రోజు ఇద్దరు హీరోలు కలిసి బుల్లితెర మీద సందడి చేయ‌నున్నారు. వీరిద్ద‌రు ఒకేసారి తెర‌పై క‌నిపిస్తే అభిమానుల‌కు అంత‌క‌న్నాపండుగ ఎముంటుంది చెప్పండి. కాగా.. గ‌తంలో మ‌హేష్‌ న‌టించిన భ‌ర‌త్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రైన విష‌యం తెలిసిందే.

ఇక సెప్టెంబర్ 20వ తేదీన‌ (సోమవారం) ప్రసారం కాబోతున్న ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షోలో ద‌ర్శ‌కులు రాజమౌళి, కొరటాల శివ లు క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

Next Story
Share it