బాలీవుడ్‌ హీరో విల్లాను వేలానికి పెట్టిన బీవోబీ బ్యాంకు

సన్నీ డియోల్‌ కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయాడట. ఆయన విల్లాను బ్యాంక్‌ ఆఫ్ బరోడా వేలానికి పెడుతోంది.

By Srikanth Gundamalla  Published on  20 Aug 2023 5:19 PM IST
Sunny deol, villa, bank of baroda, auction,

బాలీవుడ్‌ హీరో విల్లాను వేలానికి పెట్టిన బీవోబీ బ్యాంకు

బాలీవుడ్‌లో చాలా రోజులుగా పెద్ద హిట్‌ లేదు. కానీ. 'గదర్‌-2'సినిమా విడుదల తర్వాత బాలీవుడ్‌ ఇండస్ట్రీ ఊపిరిపీల్చుకుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య థిటయేటర్లలో విడుదలైన 'గదర్-2' హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాదు.. కలెక్షన్లలోనూ దూసుకెళ్తుంది. కెరీర్‌ ఇక ముగిసింది అనుకున్న టైమ్‌లో సన్నీ డియోల్‌కు కూడా ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే.. బాలీవుడ్‌లో హీరోగా ఉన్న సన్నీ డియోల్‌ కోట్ల రూపాలయ అప్పుల్లో కూరుకుపోయాడట. ఆయనకు సంబంధించిన ఓ ఖరీదైన విల్లాను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వేలానికి వేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ముంబైలోని జుహూ ప్రాంతంలో గాంధీగ్రామ్‌ రోడ్‌లో సన్నీ డియోల్‌కు ఒక విల్లా ఉంది. అయితే.. దీన్నే గ్యారెంటీగా పెట్టి సన్నీ డియోల్‌ బ్యాంక్‌ ఆఫ్ బరోడా నుంచి రూ.56కోట్ల అప్పు తీసుకున్నాడట. తిరిగి అప్పు చెల్లించకుండా తప్పించుకుంటున్నాడట. నోటీసులు పంపినా కూడా స్పందించకపోవడంతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కీలక నిర్ణయం తీసుకుంది. సన్నీ డియోల్‌ గ్యారెంటీగా పెట్టిన విల్లాను వేలానికి పెట్టి అయినా డబ్బులు తిరిగి వసూలు చేయాలని చూసింది. ఆ క్రమంలోనే ఓ పేపర్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా విల్లాను వేలం వస్తున్నట్లు ప్రకటన చేసింది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ధర్మేంద్ర కుమారుడే ఈ సన్నీ డియోల్. ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి ఉన్నాడు. చాలా సినిమాల్లో నటుడిగా కనిపంచాడు. అయితే.. కొన్నాళ్ల నుంచి సన్నీ డియోల్‌కు సరైన హిట్‌ పడలేదు. దాంతో.. బాలీవుడ్‌ ప్రేక్షకులు కూడా సన్నీ డియోల్‌ను మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అయితే.. ప్రస్తుతం విడుదలైన గదర్‌-2 సినిమా మాత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. వందల కోట్ల వసూళ్లను సాధిస్తుంది. ఒక హీరోగా ఉండి.. లోన్‌ తీసుకుని కట్టకపోవడం ఏంటంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఆ లోన్‌ తిరిగి కట్టడం సన్నీ డియోల్‌కు పెద్ద కష్టమేమీ కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ.. ఎందుకు కట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడనేది తెలియరాలేదు. బ్యాంక్‌ ఆఫ్ బరోడా వేలానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సన్నీ డియోల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Next Story