ఆయనలా ఉన్నాడనే గోవిందను వివాహం చేసుకున్నా..
బాలీవుడ్ నటుడు గోవింద వృత్తి జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంతో కూడా వార్తల్లో నిలుస్తున్నాడు.
By Medi Samrat
బాలీవుడ్ నటుడు గోవింద వృత్తి జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంతో కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. ఆయన సతీమణి సునీతా అహుజా తన అభిప్రాయాలను బాహాటంగా వ్యక్తం చేయడంతో ఆయనకు చిక్కులు వచ్చిపడుతున్నాయి. తాజాగా ఆమె ఓ పెద్ద విషయం బహిర్గతం చేసింది. ఈ విషయం తెలిస్తే.. గోవిందా అభిమానులు కొంచెం ఆశ్చర్యానికి గురవుతారు.
ఈట్ ట్రావెల్ రిపీట్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె గోవిందను పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించింది. ధర్మేంద్ర కారణంగా గోవిందను తన భర్తగా చేసుకోవాలని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పింది. ధర్మేంద్ర అంటే తనకు క్రష్ అని సునీతా అహుజా అంగీకరించింది. ధర్మేంద్ర కారణంగానే తాను గోవిందను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.
ఆమె మాట్లాడుతూ, 'నాకు ధరమ్ జీ అంటే ఇష్టం. అతను తప్ప మరెవరిని ఇష్టపడను, కానీ ఇప్పుడు నాకు షారుఖ్ ఖాన్ నటన అంటే చాలా ఇష్టం. షారూఖ్ ఒక పెద్ద నటుడు. కానీ నేను టీనేజ్‌లో ధర్మేంద్ర జీని మాత్రమే ఇష్టపడ్డాను. గోవిందా ధర్మేంద్ర జీ లా కనిపిస్తాడు. ఇద్దరూ పంజాబీలు కాబట్టి నేను అతనిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది. శాండ్‌విచ్ చిత్రంలో ధర్మేంద్ర జీ స్ఫూర్తితో గోవింద నటించాడు. అతని నటన చూస్తే ఆ సీనియర్ నటుడే గుర్తొచ్చాడని వెల్లడించింది. ఈ విషయాన్ని ధర్మేంద్ర కూడా ఒప్పుకున్నట్లు సునీత వెల్లడించింది. నేనే ఒకసారి ధర్మేంద్ర జీతో చెప్పాను.. అతను మీలాగే కనిపిస్తాడని.. అందుకే నేను పెళ్లి చేసుకున్నానని వ్యాఖ్యానించింది.