గని మూవీ.. ఉపేంద్ర, సునీల్ శెట్టి పాత్రలు రివీల్
Sunil Shetty and Upendra Characters Revealed from Ghani Movie.మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం గని.
By తోట వంశీ కుమార్ Published on
14 Nov 2021 7:49 AM GMT

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం 'గని'. స్నోర్ట్స్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకుడు. ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌కు జోడీగా శాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తున్నారు. తెలుగులో ఆమె నటిస్తున్న తొలి సినిమా ఇది. ఇందులో ఆమె 'మాయ' పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని అల్లు బాబీ, సిద్ధూ ముద్ద నిర్మిస్తుండగా.. జగపతిబాబు, నవీన్‌చంద్ర, ఉపేంద్ర, నదియా, సునీల్‌శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర బృందం వేగం పెంచింది.
'గని వరల్డ్' అంటూ.. సినిమాలోని ప్రధాన తారాగణాన్ని వెల్లడించిన చిత్ర బృందం.. ఇప్పుడు ఉపేంద్ర, సునీల్ శెట్టి పాత్రల పేర్లను తెలిపింది. విక్రమాదిత్య గా ఉపేంద్ర నటిస్తుండగా.. విజేంద్ర సిన్హగా సునీల్ శెట్టి కనిపించనున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను రేపు విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం వెల్లడించింది.
Next Story