మండేలా.. ఇంతకూ బండ్ల గణేష్ తోనా.. సునీలా..!

Sunil in tamil movie mandela remake.మండేలా.. తమిళ హాస్య నటుడు యోగి బాబు నటించిన ఈ సినిమా ఎన్నో ప్రశంసలు అందుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 May 2021 8:13 PM IST
మండేలా.. ఇంతకూ బండ్ల గణేష్ తోనా.. సునీలా..!

మండేలా.. తమిళ హాస్య నటుడు యోగి బాబు నటించిన ఈ సినిమా ఎన్నో ప్రశంసలు అందుకుంది. సామాజిక కోణం ఉన్న సినిమా..! కుల వివక్ష, రాజకీయ నాయకులు ఓటు కోసం ఎంత వరకూ తెగిస్తారు అనే విషయాలను ఎంతో బోల్డ్ గా చూపించారు. ఈ చిత్రాన్ని స్టార్ విజయ్ టీవీ ద్వారా డైరెక్టుగా విడుదల చేయగా, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ వెంటనే నెట్ ఫ్లిక్స్ లో కూడా ఇది స్ట్రీమింగ్ అయింది. ఈ సినిమాకు పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కుతూ ఉన్నాయి. ఇక ఈ సినిమాపై తెలుగు నిర్మాతల దృష్టి పడింది. కొద్దిరోజుల కిందట ఈ సినిమా తెలుగు రైట్స్ ను బండ్ల గణేష్ తీసుకున్నారనే ప్రచారం జరిగింది.

బండ్ల గణేష్ టైటిల్ పాత్రలో కనిపించబోతున్నాడని అన్నారు. ఇప్పటి వరకూ చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన బండ్ల గణేష్.. తొలిసారి పెద్ద రోల్ చేస్తున్నాడని భావించారు. అయితే ఇప్పుడు మరో వార్త మండేలా రీమేక్ విషయంలో వైరల్ అవుతూ ఉంది. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ అధినేత అనిల్ సుంకర రీమేక్ చేస్తున్న ఈ చిత్రంలో మండేలా పాత్రలో హీరోగా ప్రముఖ హాస్యనటుడు సునీల్ నటించనున్నట్టు తాజాగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో బయటకు రానున్నాయి. ప్రస్తుతం సునీల్ కమెడియన్ గానే కాకుండా.. కీలక పాత్రల్లో కూడా చేస్తున్నాయి. మరీ హీరోయిజం ఉన్న సినిమాలు కాకుండా.. కథాబలం ఉన్న సినిమాల్లో హీరోగా కూడా చేస్తానని సునీల్ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే..!


Next Story