మంగ‌ళం శ్రీనుగా భ‌య‌పెడుతున్న సునీల్

Sunil as mangalam srinu in Pushpa Movie look out.కామెడీ పాత్ర‌ల‌తో పాటు హీరోగానూ అల‌రించిన న‌టుడు సునీల్‌. ఇప్ప‌టి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Nov 2021 5:18 AM GMT
మంగ‌ళం శ్రీనుగా భ‌య‌పెడుతున్న సునీల్

కామెడీ పాత్ర‌ల‌తో పాటు హీరోగానూ అల‌రించిన న‌టుడు సునీల్‌. ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రిని న‌వ్వించిన సునీల్ ఇప్పుడు భ‌య‌పెడుతున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం పుష్ప‌. ఈ చిత్రంలో సునీల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఆయ‌న మంగ‌ళం శ్రీను పాత్ర‌లో కనిపించ‌నున్నాడు. ఆదివారం ఇందుకు సంబంధించిన లుక్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. రాక్ష‌సుడి ప‌రిచ‌యం.. మంగ‌ళం శ్రీనుగా సునీల్ అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట‌ర్‌లో సునీల్ చాలా సీరియ‌స్ లుక్‌తో క‌నిపిస్తున్నాడు. బ‌ట్ట‌త‌ల‌తో, భ‌యంక‌ర‌మైన ఎక్స్‌ప్రెష‌న్ ఇస్తూ భ‌య‌పెడుతున్నాడు. సునీల్ లుక్ చూసి అంద‌రు స్ట‌న్ అవుతున్నారు. ప్ర‌స్తుతం ఈ లుక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుద‌ల కానుంది. తొలి పార్టుకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. బ‌న్ని స‌ర‌స‌న ర‌ష్మిక మందాన న‌టిస్తోంది. విల‌న్‌గా మ‌ల‌యాళీ నటుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ న‌టిస్తున్నారు. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. పుష్ప ది రైజ్ పేరుతో తొలి భాగం డిసెంబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story
Share it