ఏ1 ఎక్స్‌ప్రెస్ ట్రైల‌ర్ టాక్‌.. సందీప్ ఖాతాలో హిట్ ప‌డేలా ఉందిగా

Sundeep kishan A1 Express official trailer.సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ఏ1 ఎక్స్‌ప్రెస్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jan 2021 6:15 PM IST
Sundeep kishan A1 Express official trailer

సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్‌'. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. "మ‌న‌దేశంలో స్పోర్ట్‌మెన్‌కు ఇవ్వాల్సిన క‌నీస గౌర‌వం కూడా ఇవ్వ‌టం లేదు స‌ర్‌. ఇక్క‌డ స్పోర్ట్స్ బిజినెస్ అయి చాలా కాలం అయింది. ఏ స్పోర్ట్స్ చూడాలో.. ఏది చూడ‌కూడ‌దో బిజినెస్‌మెన్ నిర్ణ‌యిస్తున్నాడు" అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు ట్రైల‌ర్‌లో సందీప్ కిష‌న్‌. ఈ చిత్రంలో ఆయన హాకీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. 'ఈ చారిత్రాత్మ‌క ఆట సాక్షిగా ఈ సారి క‌ప్పు మ‌న‌మే కొడుతున్నాం' అంటూ రావు ర‌మేశ్ చెప్పే డైలాగ్ ఈల‌లు వేయిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.

ఈ చిత్రంతో సందీప్ స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠి న‌టిస్తోంది. ఈ ఇద్ద‌రి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్లు కనిపిస్తోంది. డెన్నిస్ జీవన్ కనుకొలను ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సందీప్ కిషన్, టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 26న ప్రేక్ష‌కుల ముందుకు ఈ చిత్రం రానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఎనలేని ఆదరణ సంతరించుకున్నాయి. అంతేకాకుండా టాలీవుడ్‌లో వస్తున్న మొట్టమొదటి హాకీ థీమ్ సినిమా ఇదే. ట్రైల‌ర్ చూస్తుంటే.. సందీప్ ఖాతాలో హిట్ ప‌డేలా క‌న‌బ‌డుతోంది.


Next Story