ఆ హీరోయిన్‌ కుమారుడి పెళ్ళికి 10వేల మంది హాజరు

Sumalatha's Son Abhishek Ambareesh Ties The Knot With Aviva Bidappa. టాలీవుడ్ సీనియర్‌ నటి, కర్ణాటక ఎంపీ సుమలత కుమారుడు అభిషేక్‌ వివాహం జూన్‌ 5న అంగరంగ వైభవంగా జరిగింది.

By Medi Samrat  Published on  5 Jun 2023 8:45 PM IST
ఆ హీరోయిన్‌ కుమారుడి పెళ్ళికి 10వేల మంది హాజరు

టాలీవుడ్ సీనియర్‌ నటి, కర్ణాటక ఎంపీ సుమలత కుమారుడు అభిషేక్‌ వివాహం జూన్‌ 5న అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రసాద్‌ బిదపా కుమార్తె అవివా బిదపాతో అభిషేక్‌ పెళ్లి జరిగింది. బెంగళూరులోని ఓ ప్యాలెస్‌లో ఒక్కలింగ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు పలువురు రాజకీయవేత్తలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు పది వేల మంది అతిథులు పెళ్లికి హాజరయ్యారు. ఎంపీ అయిన సుమలత ప్రధాని మోదీని కూడా ఆహ్వానించారు. నటి సుమలత తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడ స్టార్ అంబరీశ్ ను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రజనీకాంత్‌, మోహన్‌బాబు, హీరో యష్‌, సుహాసినీ మణిరత్నం, క్రికెటర్ అనిల్‌ కుంబ్లే తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. పలువురు అభిమానులు, సెలబ్రెటీలు సోషల్‌ మీడియా వేదికగా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం అభిషేక్‌, అవివాల పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వెడ్డింగ్‌ రిసెప్షన్‌ జూన్ 7న జరగనుంది.


Next Story