కార్తి 'సుల్తాన్' టీజర్.. అదరహో
Sulthan Official Teaser Release. కోలీవుడ్ హీరో కార్తీ చిత్ర టీజర్‌ను విడుదల చేసింది
By తోట వంశీ కుమార్ Published on 1 Feb 2021 6:53 PM IST'యుగానికి ఒక్కడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు కోలీవుడ్ హీరో కార్తీ. తాను నటించే ప్రతి సినిమాను కూడా తెలుగులో విడుదల చేస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'సుల్తాన్'. 'రెమో' ఫేమ్ బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్ ప్రకాష్ బాబు, ఎస్.ఆర్ ప్రభు నిర్మించారు. ఈ చిత్రంలో కార్తీ సరసన రష్మిక మందాన నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
'మహాభారతం చదివావా.. భారతంలో కృష్ణుడు వంద అవకాశాలు ఇచ్చినా కౌరవులు మారలేదు.. నువ్వు ఇవ్వమంటుంది ఒక్క అవకాశమే కదా.. ఇస్తా..' అనే వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ప్రారంభమైంది. 'మహాభారంలో కృష్ణుడు పాండవుల వైపు నిల్చున్నాడు. అదే కృష్ణుడు కౌరవుల వైపు ఉంటే.. అదే మహాభారతాన్ని యుద్దం లేకుండా ఊహించుకోండి సర్' అంటూ కార్తీ చెప్పే డైలాగ్ ఈలలు వేయిస్తోంది. మొత్తం టీజర్‌తో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.