'మమ్మల్ని క్షమించండి.. జబర్దస్త్ నుంచి మేము వెళ్లిపోతున్నాం'.. స్టేజీపైనే ప్రకటించిన సుడిగాలి సుధీర్ టీమ్
Sudigali Sudheer team Quits from Jabardasth.బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో కు ఉన్నక్రేజే వేరు. ఈ షోకు పోటీగా ఎన్నో
By తోట వంశీ కుమార్ Published on 8 Dec 2021 7:59 AM ISTబుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో కు ఉన్నక్రేజే వేరు. ఈ షోకు పోటీగా ఎన్నో కామెడీ షోలు వచ్చినా.. ఏదీ నిలదొక్కుకోలేకపోయింది. ఇందులో నటించిన వారు కమెడియెన్లుగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక చాలాకాలం నుంచి బజర్థస్త్ షో నుంచి సుడిగాలి సుధీర్ టీమ్ తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఆ వార్తలను ఆ మధ్య గెటప్ శ్రీను కొట్టిపారేశాడు. దీంతో వీరి అభిమానులు అంతా ఊపిరిపీల్చుకున్నారు. వీరు ఎప్పటిలాగానే స్టేజీపై కామెడీ చేస్తూ అలరిస్తున్నారు.
అయితే.. తాజాగా ఈ ముగ్గురు జబర్థస్త్‌ను వీడనున్నట్లు ప్రకటించేశారు. అది కూడా ఎక్కడో కాదండోయ్ ఏకంగా జబర్థస్త్ స్టేజీ మీదనే ఈ విషయాన్ని వెల్లడించారు. తాజాగా ఎక్స్‌ట్రా జబర్థస్త్ ప్రోమో విడులైంది. ఇందులో ఈ ముగ్గురు చిందులు వేస్తూ కనిపించారు. తరువాత గెటప్ శ్రీను ఎమోషనల్‌గా ఫేస్ పెట్టి.. 'చాలా రోజుల నుంచి ముగ్గురం కలిసి.. ఇకపై జబర్థస్త్ నుంచి మేమూ..' అంటూ గ్యాప్ ఇవ్వగా.. రామ్‌ప్రసాద్ మాట్లాడుతూ.. 'ఈ విషయాన్ని ఇంటర్వ్యూ పెట్టి చెప్పాలని అనుకున్నాం. ఈ స్టేజీ మీదనే చెప్పాల్సి వస్తుంది. ఇకపై జబర్థస్త్ నుంచి మేము వెళ్లి పోవాలనుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి ఇన్ని రోజులు మమ్మల్ని ఆదరించినందుకు కృతజ్ఞతలు' అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే.. ఇది నిజం కాదని చాలా మంది నెటీజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ నిజంగానే సుధీర్ టీమ్ వెళ్లిపోతే.. ఇలా చెప్పి వెళ్లిపోయేది కాదంటున్నారు. ఇదంతా కామెడీలో ఓ భాగం అని అంటున్నారు. గతంలో ఈ షోకు జడ్జీగా వ్యవహరించిన నాగబాబు కానీ, కొందరు కమెడీయన్లు జబర్థస్త్‌ను వీడే ముందు ఎలాంటి హడావుడి లేకుండానే వెళ్లిపోయారని.. సుధీర్ టీమ్ కూడా జబర్థస్త్‌ను వీడితే అలాగే వెలుతారు తప్ప ఇలాంటి ప్రకటనలు ఉండవని నెటీజన్లు అంటున్నారు. మరీ నిజం ఏంటో తెలియాలంటే 10 డిసెంబర్ ఎక్స్‌ట్రా జబర్థస్త్ ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు.