ఆకట్టుకుంటున్న 'గాలోడు' టీజర్
Sudigali Sudheer Gaalodu teaser released.జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్.
By తోట వంశీ కుమార్ Published on
31 Dec 2021 7:01 AM GMT

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. బుల్లితెరపై స్టార్‌గా వెలుగొందుతున్నప్పటికి వెండితెరపై సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. 'సాఫ్ట్‌వేర్ సుధీర్', '3 మంకీస్' చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ ఆశించిన ఫలితం తక్కలేదు. మరోసారి ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 'గాలోడు' గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుధీర్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు.
తాజాగా ఈ చిత్ర టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 'అదృష్టాన్ని నమ్ముకున్నవాడు కష్టాల పాలవుతాడు.. కష్టాన్ని నమ్ముకున్నవాడు అదృష్టవంతుడవుతాడు. కానీ నేను ఈ రెండిటినీ నమ్ముకోను.. నన్ను నేను నమ్ముకుంటాను' అని సుధీర్ చెప్పే డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభమైంది. మాస్ యాక్షన్ సీన్స్‌పైనే ఈ టీజర్‌ను కట్ చేశారు. ఈ చిత్రంలో సప్తగిరి, పృథ్వీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Next Story