ఘనంగా సుడిగాలి సుధీర్ ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ ఇదే..!
Sudigali Sudheer Engagement Promo Goes Viral.సుడిగాలి సుధీర్.. పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఓ కామెడీ షోతో
By తోట వంశీ కుమార్
సుడిగాలి సుధీర్.. పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఓ కామెడీ షోతో తన కెరీర్ ను ప్రారంభించిన సుధీర్ చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. సుడిగాలి సుధీర్ ఎంగేజ్‌మెంట్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ షోలో సుధీర్‌కు నిశ్చితార్థం జరిగింది. దీంతో సుధీర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడా..? అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఊపందుకుంది.
ఇక సుడిగాలి సుధీర్ అనే పేరు చెప్పగానే వెంటనే రష్మి గౌతమ్ గుర్తుకు వస్తుంది. వీరిద్దరి మధ్య ఏదో ఉందని చాలా ఏళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ చేయడంతో పాటు పెళ్లి కూడా చేసేశారు. అయితే.. అదంతా స్కిట్ లో భాగంగానే జరిగింది. వీరిద్దరు రియల్ లైఫ్ లో కపుల్ అయితే బాగుండు అని కోరుకునే అభిమానులు లేకపోలేదు. ఇదిలా ఉంటే.. ఈ సారి కూడా సుధీర్ ఎంగేజ్‌మెంట్ కూడా ప్రాంక్ అయి ఉంటుందని మెజారిటీ నెటీజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటి వరకు చాలా సార్లు మోసపోయాం కానీ.. ఈ సారి మీకు ఆ అవకాశం ఇవ్వమని అంటున్నారు. అయితే.. సుధీర్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఆ అమ్మాయి ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిగా కనిపిస్తోందని.. ఈ సారి నిజంగానే సుధీర్ నిశ్చితార్థం చేసుకున్నాడని అనే వారు లేకపోలేదు. మరి ఇదెంత వరకు నిజమో తెలియాలంటే ఆ షో ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
అమ్మాయి పేరు తేజస్వీ నాయుడు
ఇక సుధీర్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఆ అమ్మాయి ఎవరా అని నెటీజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి పేరు తేజస్వీ నాయుడు. తను ఓ మోడల్ అని తెలుస్తోంది. కొన్ని యాడ్స్ చేసింది. అయితే.. ఇప్పటి వరకు పెద్దగా లైమ్‌లైట్‌లోకి రాలేదు. మరీ నిజంగా సుధీర్ ఎంగేజ్‌మెంట్ అయిందా..? లేదా తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.