ఓటీటీలోకి సుధీర్ బాబు 'హరోమ్ హర' మూవీ

సుధీర్ బాబు హీరోగా నటించిన హరోమ్ హర సినిమాకు మంచి సమీక్షలే కాకుండా మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి.

By అంజి  Published on  8 July 2024 9:30 PM IST
Sudhir Babu, Harom Hara movie, OTT

ఓటీటీలోకి సుధీర్ బాబు 'హరోమ్ హర' మూవీ 

సుధీర్ బాబు హీరోగా నటించిన హరోమ్ హర సినిమాకు మంచి సమీక్షలే కాకుండా మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. గత నెలలో విడుదలైన ఈ సినిమాను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కు ఈ సినిమా బాగా నచ్చింది. కుప్పంలో గన్స్ తయారీ చేస్తూ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తులపై పోరాడాడు.. ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనే విషయాన్ని సినిమాలో బాగా చూపించారు. ప్రీమియర్స్ లో మంచి టాక్ కూడా వచ్చింది.

ఈ చిత్రం OTT విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లలో వచ్చిన దానికంటే ఓటీటీలో ఇంకా మంచి ఆదరణను అందుకుంటుందని ఆశిస్తూ ఉన్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆహా వీడియో జూలై 11 నుండి ప్రసారం అవుతుంది. జ్ఞానసాగర్ ద్వారక రచన, దర్శకత్వం వహించిన హరోమ్ హర సినిమాను సుమంత్ జి నాయుడు నిర్మించారు. మాళవిక శర్మ, సునీల్, జయప్రకాష్, రవి కలి కీలక పాత్రల్లో నటించారు.

Next Story