Sudheer Babu : సుధీర్ బాబు ఇలా అయ్యాడేంటి..? సిక్స్ ప్యాక్ ఏమైంది..?

సుధీర్ బాబు హీరోగా న‌టిస్తున్న మామా మ‌శ్చీంద్ర సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌లైంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 March 2023 2:42 PM IST
Mama Mascheendra first look, Mama Mascheendra movie,

Mama Mascheendra first look

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా చిత్రాల‌ను చేస్తున్నాడు న‌టుడు సుదీర్ బాబు. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'హంట్' చిత్రాల‌పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న‌ప్ప‌టికీ అవి మిశ్ర‌మ స్పంద‌న‌ల‌కే ప‌రిమితం అయ్యాయి. ప్ర‌స్తుతం సుధీర్ బాబు ఆశ‌ల‌న్నీ "మామా మ‌శ్చీంద్ర" పైనే ఉన్నాయి. ఈ చిత్రం కోసం సుధీర్ బాబు పూర్తిగా మారిపోయాడు. ఆరుపలకల దేహంతో అల్ట్రాస్టైలిష్‌గా క‌నిపించే ఆయ‌న ల‌డ్డూబాబులా మేకోవ‌ర్ అయ్యాడు.

ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ను బుధ‌వారం విడుద‌ల చేశారు. 'బెట్‌.. ఇలా వ‌స్తాను అని మీరు అనుకుని ఉండ‌రు' అని సోష‌ల్ మీడియాలో ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను షేర్‌ చేశాడు. ప్ర‌స్తుతం ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిని చూసిన నెటీజ‌న్లు.. సుధీర్ అన్న నువ్వేనా అస్స‌లు గుర్తు ప‌ట్టేలే.. స‌డ‌న్‌గా చూసి అల్ల‌రి న‌రేశ్ అని అనుకున్నాం అని కొంద‌రు కామెంట్లు చేయ‌గా.. అన్నా సిక్స్ ప్యాక్ ఏమైంది..? అంటూ మ‌రికొంద‌రు కామెంట్లు పెడుతున్నారు.

హర్షవర్ధన్‌ దర్శకత్వంలో 'మామా మ‌శ్చీంద్ర' తెర‌కెక్కుతోంది. శ్రీ వేంట‌కేశ్వ‌రా సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై సునీల్‌ నారంగ్‌, పుస్కుర్ రామ్‌ మోహన్‌ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ చూస్తుంటే ఏదో కొత్త‌గా ట్రై చేశారని అనిపిస్తోంది.


Next Story