సినీ నటుడు శుభలేఖ సుధాకర్ ఇంట్లో విషాదం
Subhalekha Sudhakar Mother Passed away.ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన
By తోట వంశీ కుమార్ Published on
8 Sep 2021 4:14 AM GMT

ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి ఎస్‌ఎస్ కాంతం మంగళవారం కన్నుమూశారు. ఆమె వయస్సు 82 సంవత్సరాలు. మూడు నెలల క్రితం ఆమె గుండెపోటుకు గురయ్యారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది. వయస్సు పై బడడం, ఇతర అనారోగ్య కారణాలతో పరిస్థితి విషమించడంతో.. చెన్నై మహాలింగపురంలో సుధాకర్ నివాసంలో మంగళవారం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు నేడు చెన్నైలో జరగనున్నాయి.
చెన్నై మహాలింగపురంలోని సుధాకర్ నివాసంలో తండ్రి సూరావజ్జల కృష్ణారావు, తల్లి ఎస్‌ఎస్ కాంతం ఉండేవారు. రెండేళ్ల క్రితం కృష్ణారావు మరణించారు. కాగా.. కృష్ణారావు, కాంతం దంపతులకు ముగ్గురు కొడుకులు. సుధాకర్ పెద్దవారు. రెండో కుమారుడు మురళీ దత్తుపోయి వైజాగ్‌లో, మూడో కుమారుడు సాగర్ అట్లాంటాలో స్థిరపడ్డారు.
Next Story