Video: స్టంట్ చేస్తుండగా పల్టీలు కొట్టిన కారు..మాస్టర్ మృతి
తమిళ మూవీ ఇండస్ట్రీలో ఘోర విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik
Video: స్టంట్ చేస్తుండగా పల్టీలు కొట్టిన కారు..మాస్టర్ మృతి
తమిళ మూవీ ఇండస్ట్రీలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కోలీవుడ్ పాపులర్ స్టంట్ మాస్టర్ రాజు, యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయాడు. పా. రంజిత్ దర్శకత్వంలో ఆర్య హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్‌లో భాగంగా ఓ కారు స్టంట్ చేస్తుండగా యాక్సిడెంట్ జరగడంతో రాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.
అయితే బుధవారం సినిమా షూటింగ్ లో భాగంగా రాజ ఓ కారు స్టంట్ చేస్తుండగా యాక్సిడెంట్ జరగడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్టార్ హీరో విశాల్ రాజు మృతిని అధికారికంగా ప్రకటించారు. విశాల్ హీరోగా నటించిన పలు సినిమాలకు స్టంట్ మాస్టర్ గా వ్యవహరించాడు రాజు. దీంతో సోషల్ మీడియా వేదికగా అతనికి నివాళి అర్పించాడు విశాల్. రాజు కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు.
కాంచీపురం నెహ్రూ పూంగండం ప్రాంతానికి చెందిన ఫైట్ మాస్టర్ మోహన్ రాజు వయసు 52 ఏళ్లు. తమిళ సినీ పరిశ్రమలో రాజు అనేక సినిమాలకు స్టంట్ కో-ఆర్డినేటర్గా వర్క్ చేశారు. ఆయన ధైర్యంగా రిస్క్ తీసుకునే నైపుణ్యం, డెడికేషన్‌కు ఇండస్ట్రీలో మంచి పేరుంది. హీరో విశాల్‌తో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాల్లో ఆయన చేసిన స్టంట్లు ప్రేక్షకుల మెప్పు పొందాయి. రాజు మృతితో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు.