హీరోయిన్‌తో అసభ్యంగా ప్రవర్తించిన స్టూడెంట్‌

Student misbehaves with Soorarai Pottru actress Aparna Balamurali.సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఇటీవ‌ల ఓకాలేజీలో జ‌రిగిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jan 2023 12:02 PM IST
హీరోయిన్‌తో అసభ్యంగా ప్రవర్తించిన స్టూడెంట్‌

సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఇటీవ‌ల ఓ కాలేజీలో జ‌రిగిన వేడుక‌కు మూవీ టీమ్‌తో క‌లిసి మ‌ల‌యాళ న‌టి అప‌ర్ణ బాల‌ముర‌ళి హాజ‌రైంది. అయితే.. ఓ విద్యార్థి ఆమెతో అనుచితంగా ప్ర‌వ‌ర్తించాడు. దీంతో అప‌ర్ణ అసౌక‌ర్యానికి గురైంది.

వివ‌రాల్లోకి వెళితే.. థంకమ్ అనే చిత్రంలో అప‌ర్ణ న‌టించింది. ఇటీవల కేరళలో జరిగిన కాలేజీ ఈవెంట్‌కు అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్‌లతో సహా థంకమ్ మూవీ టీమ్ హాజ‌ర‌య్యారు. వేదిక‌పై చిత్ర‌బృందం కూర్చోని ఉంది. హీరోయిన్ అయిన అప‌ర్ణ‌కు స్వాగ‌తం ప‌లికేందుకు ఓ విద్యార్థి స్టేజీపైకి వ‌చ్చాడు. మొద‌ట ఫ్ల‌వ‌ర్ బొకే ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆమె నిల‌బ‌డ‌గానే ఆమె భుజంపై చేయి వేసేందుకు ప్ర‌య‌త్నించాడు.

దీన్ని గ‌మ‌నించిన అపర్ణ.. స్టూడెంట్ నుంచి త‌ప్పించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అయితే.. ఈ ఘ‌ట‌న‌ను అక్క‌డే ఉన్న కాలేజీ యాజ‌మాన్యం, చిత్ర‌బృందం అడ్డుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. నెటీజ‌న్లు అప‌ర్ణ బాల‌ముర‌ళికి మ‌ద్ద‌తుగా పోస్టులు పెడుతున్నారు. కాగా.. తాను చేసిన ప‌నికి ఆ విద్యార్థి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. అప‌ర్ణ బాల‌ముర‌ళి తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచిత‌మే. సూర్య‌కు జోడిగా "ఆకాశ‌మే నీ హ‌ద్దురా" చిత్రంతో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెద‌ర‌ని ముద్ర వేసింది. ప్ర‌స్తుతం ఆమె ఫ‌హాద్ ఫాజిల్‌తో హోంబ‌లే ఫిల్మ్స్ నిర్మిస్తోన్న 'ధూమం' చిత్రంలో న‌టిస్తోంది. ఈ చిత్రంతో పాటుగా మ‌రో ఆరు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.

Next Story