ఆర్ఆర్ఆర్ విడుద‌ల తేదీపై కొనసాగుతున్న స‌స్పెన్స్..!

Still Suspense on RRR movie release date.సినీ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రాల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Oct 2021 7:51 AM GMT
ఆర్ఆర్ఆర్ విడుద‌ల తేదీపై కొనసాగుతున్న స‌స్పెన్స్..!

సినీ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుథిరం)' ఒక‌టి. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం కావ‌డంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ మొత్తం పూరైపోయింది. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. వాస్త‌వానికి అక్టోబ‌ర్ 13న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్న‌ట్లు తొలుత మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే.. క‌రోనా కార‌ణంగా కొన్ని రాష్ట్రంలో థియేట‌ర్ల‌పై ఆంక్ష‌లు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో చిత్ర విడుద‌ల‌ను వాయిదా వేశారు. ఈ చిత్రం ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని అభిమానులు వేయి క‌న్నుల‌తో ఎదురుచూస్తున్నారు.

సంక్రాంతికి ఈ చిత్రాన్ని తీసుకురావాల‌ని మేక‌ర్స్ బావిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే.. ఇప్ప‌టికే సంక్రాంతి బ‌రిలో 'రాధే శ్యామ్' వంటి పాన్ ఇండియా సినిమాలు బ‌రిలో ఉండ‌డంతో చిత్ర‌బృందం కాస్త సందిగ్ధంలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. వేస‌వి కానుక‌గా ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది మార్చి 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే.. చిత్ర‌బృందం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. అయితే.. నేడు దీనిపై క్లారిటీ రానుంద‌ని అంటున్నారు.

Next Story
Share it