సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అమెరికన్ హిప్ హాప్ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, నటుడు స్టీఫెన్ లారెల్ "ట్విచ్" బాస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాస్ ఏంజిల్స్‌లోని ఓ హోటల్ గదిలో గన్‌తో షూట్ చేసుకున్నాడు. అతడి వయస్సు 40 సంవత్సరాలు. కాగా.. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
స్టీఫెన్ లారెల్ ఇక లేడు అనే విషయాన్ని అతడి భార్య అలిసన్ హోల్కర్ బాస్ ధృవీకరించింది. "నా భర్త స్టీఫెన్ మమ్మల్ని విడిచిపెట్టాడని విషయాన్ని ఎంతో భారమైన హృదయంతో మీతో పంచుకుంటున్నాను. మా కుటుంబానికి అతడే వెన్నుముక. స్నేహితులు, కుటుంబం, సమాజానికి ఎంతో విలువ ఇచ్చేవాడు. మంచి భర్త, అలాగే ఉత్తమ తండ్రి కూడా. అతడి జ్ఞాపకాన్ని మనం గౌరవించని రోజు ఉండదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో మా గోప్యతకు భంగం కలిగించకుండా ఉండాలని అందరిని చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. స్టీఫెన్ మేము నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాము. నీ ఆత్మకు శాంతి కలగాలి అని ఆమె అంది.
'The ellen degeneres show', 'So you think you can dance' షోలతో స్టీఫెన్ బాగా పాపులర్ అయ్యాడు. 'step up','magic mike xx' అనే సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్టీఫెన్ అనేక రియాలిటీ షోలకు హోస్ట్‌గా పని చేశాడు.