ఆ సినిమా సీక్వెల్ రాజమౌళికి కూడా తెగ నచ్చేయడంతో ఏమి చేశారంటే..!

SS Rajamouli reviews Mohanlal's Drishyam 2, sends a long text to Jeethu Joseph. తాజాగా దర్శకధీరుడు రాజమౌళికి కూడా దృశ్యం-2 సినిమా తెగ నచ్చేసింది. దీంతో ఆ చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్ ను పొగడ్తల్లో ముంచేశారు.

By Medi Samrat  Published on  15 March 2021 9:54 AM GMT
SS Rajamouli reviews Mohanlals Drishyam 2, sends a long text to Jeethu Joseph

దృశ్యం.. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత పలు భాషల్లో కూడా రీమేక్ అవ్వడం.. అక్కడ కూడా అద్భుతమైన విజయాల్ని అందుకోవడం జరిగింది. తెలుగులో కూడా విక్టరీ వెంకటేష్ హీరోగా చేశారు. ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా సెకండ్ పార్ట్ దృశ్యం-2 ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది. చూసిన ప్రతి ఒక్కరూ కథ అద్భుతం అని.. క్లైమాక్స్ అసలు ఊహించలేమని చెప్పుకొచ్చారు. పలువురు ప్రముఖులు సినిమాను మెచ్చుకున్నారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళికి కూడా ఈ సినిమా తెగ నచ్చేసింది. దీంతో ఆ చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్ ను పొగడ్తల్లో ముంచేశారు.

ఫిబ్రవరి 19న అమెజాన్‌లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో దీనిపై జీతూ జోసెఫ్‌కు రాజ‌మౌళి వాట్సాప్‌లో మెసేజ్ పంపారు. ఈ మెసేజ్ గురించి జీతూ త‌న సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. తాను దృశ్యం 2 సినిమా చూసిన తర్వాత త‌న ఆలోచలన్నీ దాని చుట్టూనే తిరిగాయని జీతూకి రాజ‌మౌళి మెసేజ్ చేశారు. మొద‌టి సారి తెలుగులో దృశ్యం విడుద‌లైన‌ప్పుడు తాను వెంటనే మళ్లీ ఒకసారి మలయాళ 'దృశ్యం' సినిమా చూశానని రాజ‌మౌళి తెలిపారు. ఈ సినిమా దర్శకత్వంతో పాటు స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, యాక్టింగ్ అన్ని విభాగాలు అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆ సినిమా క‌థ‌ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడి ఉంద‌ని ప్ర‌శంసించారు. 'దృశ్యం' ఒక మాస్టర్‌ పీస్ అని, అంతే ఉత్కంఠతో సీక్వెల్‌ తీసుకురావడం గొప్ప విషయమ‌ని చెప్పారు. జీతూ నుంచి మరికొన్ని మాస్టర్‌ పీస్ సినిమాలు రావాలని కోరుతూ రాజమౌళి మెసేజ్ చేశారు.
Next Story