రాజ‌మౌళి ఎమోష‌న‌ల్ పోస్ట్.. ఆస్కార్ స్టేజీపై మ‌న పాట‌.. తారక్‌, చరణ్‌ల‌కు క్షమాపణలు

SS Rajamouli react to Naatu Naatu Oscar nomination.దర్శకధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jan 2023 11:53 AM IST
రాజ‌మౌళి ఎమోష‌న‌ల్ పోస్ట్.. ఆస్కార్ స్టేజీపై మ‌న పాట‌.. తారక్‌, చరణ్‌ల‌కు క్షమాపణలు

దర్శకధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం)'. ఈ చిత్రంలోని "నాటు నాటు" పాట ఇప్ప‌టికే ప్ర‌తిష్టాత్మ‌క‌ గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకోగా, తాజాగా ఆస్కార్ ఫైన‌ల్ నామినేష‌న్స్‌లో నిలిచింది. ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో టాప్‌-4లో నిలిచింది. దీనిపై రాజ‌మౌళి స్పందించారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎమోష‌న‌ల్ పోస్ట్ చేశారు జ‌క్క‌న్న‌.

"నా చిత్రంలో నా పెద్ద‌న్న‌(కీర‌వాణి) త‌న పాట‌కు ఆస్కార్ నామినేష‌న్ పొందారు. ఇంత‌కంటే నాకు ఏమీ వ‌ద్దు. నేను ఇప్పుడు చ‌ర‌ణ్‌, తార‌క్‌ల కంటే ఫాస్ట్‌గా నాటు నాటు సాంగ్‌కు డ్యాన్స్ చేస్తున్నా. చంద్ర‌బోస్‌కు కంగ్రాచ్యులేష‌న్స్.. ఆస్కార్ వేదిక మీద మన పాట వినిపిస్తోంది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్.. ఈ సాంగ్ కోసం మీ మీరు ప‌డిన క‌ష్టానికి నేను మీకు నా వ్యక్తిగత ఆస్కార్ ఇచ్చేస్తాను. చాలా కాలం ఈ పాట విష‌యంలో సందిగ్ధంలో ఉన్న నాకు భైరవ బీజీఎం ఎంతో భరోసా అందించింది. మరింత ముందుకు తీసుకెళ్లవచ్చన్న న‌మ్మ‌కాన్ని ఇచ్చింది. థాంక్యూ భైరి బాబు. ఇక ఈ పాట ఇంత‌లా పాపుల‌ర్ కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం, స్టైల్‌. వారు త‌మ‌దైన శైలిలో డ్యాన్స్ చేసి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టారు.

ఇక ఈ సినిమా చిత్రీక‌ర‌ణ కోసం నేను వాళ్ల‌ను టార్చ‌ర్ పెట్టాను. అందుకు క్ష‌మాప‌ణ‌లు. మ‌రోసారి ఛాన్స్ దొరికితే మాత్రం మ‌ళ్లీ వాళ్ల‌ను ఆడుకునేందుకు నేను సిద్ధం. ఇక నేను ఎప్పుడూ ఆస్కార్ వ‌ద్ద‌కు వెళ‌తాన‌ని అనుకోలేదు. ఇది పూర్తిగా నాటు నాటు, ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఉన్న అభిమానుల వ‌ల్లే సాధ్య‌మైంది. మీ అంద‌రి అభిమానం చూడ‌డం వ‌ల్లే ఈ పాట‌ను ముందుకు తీసుకువెళ్లాలి అన్న ఆలోచ‌న మాకు క‌లిగింది. ఇందుకు మీ అభినంద‌రికి హృద‌య‌పూర్వ‌క అభినంద‌లు.

అలుపెరగకుండా, పని రాక్షసుడిలా వ్యవహరించిన కార్తికేయ లేకపోతే ఇధ్యం సాధ్య‌మ‌య్యేది కాదు. కార్తికేయ‌ను చూసి గ‌ర్విస్తున్నా. నాటు నాటు పాటకు ప్రచారం కల్పించడంలో నిరంతరం కృషి చేసిన ప్రదీప్, హర్ష, చైతన్యలకు ధ‌న్య‌వాదాలు. ఆస్కార్‌కు అడుగు దూరంలో ఉన్నాం. థ్యాంక్యూ "అని రాజ‌మౌళి ట్వీట్ చేశారు.


Next Story