జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువల్ వండర్ 'అవతార్'. ఈ సినిమా సిరీస్ లో భాగమైన 'అవతార్: ఫైర్ అండ్ యాష్' విడుదలకు ముందు, ఎస్.ఎస్. రాజమౌళి జేమ్స్ కామెరూన్‌తో కలిసి వర్చువల్ ఇంటరాక్షన్ నిర్వహించారు. ఈ చిత్రాన్ని చూసిన మొదటి భారతీయుడు రాజమౌళినే!! ఈ సైన్స్-ఫిక్షన్ చిత్రం తీసిన కామెరూన్‌ను రాజమౌళి ప్రశంసించారు. ప్రత్యేక ప్రదర్శన కోసం కామెరూన్‌కు కృతజ్ఞతలు తెలిపారు రాజమౌళి. 1.45 బిలియన్ల భారతీయులలో అవతార్: ఫైర్ అండ్ యాష్‌ను చూసిన మొదటి వ్యక్తి లేదా బహుశా ఏకైక వ్యక్తిగా తనను నిలిపినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, అది చాలా ప్రత్యేకంగా అనిపిస్తుందని రాజమౌళి తెలిపారు. సినిమా చూశానని అద్భుతంగా ఉందంటూ రాజమౌళి అన్నారు.
ఎస్ఎస్ రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమా విషయంలో ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తర్వాత, అభిమానులు ఈ చిత్రం గురించి మరిన్ని అప్‌డేట్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. వారణాసి షూటింగ్ వివరాలను రాజమౌళి వెల్లడించారు. తమ బృందం ఒక సంవత్సరం నుండి సినిమా షూటింగ్‌లో భాగమై ఉందని, షూటింగ్ పూర్తి చేయడానికి 8-9 నెలలు అవసరమని చెప్పారు. రాజమౌళి మాటల ప్రకారం, వారణాసి మొత్తం షూటింగ్ ఆగస్టు 2026 నాటికి పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరిగితే, సినిమా షెడ్యూల్ చేసిన టైమ్‌లైన్‌లో విడుదల చేయవచ్చు. అయితే జక్కన్న గత చిత్రాల 'వాయిదా పద్ధతుంది' కాబట్టి.. రాజమౌళి చెప్పిన మాటలను నమ్మలేకపొతున్నారు టాలీవుడ్ జనాలు.
కామెరూన్ రాజమౌళితో మాట్లాడుతూ వారణాసి సినిమా సెట్‌ను సందర్శించడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు. మిమ్మల్ని సెట్‌లోకి స్వాగతించడానికి తమ చిత్ర పరిశ్రమ సిద్ధంగా ఉంటుందని రాజమౌళి అన్నారు.