కీర‌వాణికి ప‌ద్మ‌శ్రీ.. 'కాస్త గ్యాప్ ఇవ్వమ్మా..' అంటూ రాజ‌మౌళి ఆస‌క్తిక‌ర ట్వీట్

SS Rajamouli feels there should be a 'gap between Awards' as brother MM Keeravani honoured with Padma Shri.ఎంఎం కీర‌వాణికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jan 2023 11:03 AM IST
కీర‌వాణికి ప‌ద్మ‌శ్రీ.. కాస్త గ్యాప్ ఇవ్వమ్మా.. అంటూ రాజ‌మౌళి ఆస‌క్తిక‌ర ట్వీట్

సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీర‌వాణికి కేంద్రం ప‌ద్మ‌శ్రీ అవార్డు ప్ర‌క‌టించడం ప‌ట్ల ఆయ‌న సోద‌రుడు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి స్పందించారు. ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. ప‌ద‌శ్రీ అవార్డు గుర్తింపు కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను అని చెప్పారు. కీర‌వాణితో ఉన్న ఫోటోను సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకున్నారు. అవార్డు, అవార్డుకు కాస్త గ్యాప్ ఇవ్వ‌మ‌ని, అప్పుడే విజ‌యాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించే అవ‌కాశం ఉంటుంద‌ని, ఈ విష‌యాన్ని విశ్వానికి చెబుతాన‌ని తెలిపారు.

మీ అభిమానులలో చాలామంది భావించినట్లుగానే నేను కూడా అనుకుంటున్నాను. ఈ గుర్తింపు ఎప్పుడో రావాల్సి ఉందని. అయితే.. ఒక వ్య‌క్తి క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లాన్ని ఊహించ‌ని రీతిలో విశ్వం అందిస్తుంద‌ని మీరు చెప్పిన మాట‌ల‌ను నేను ఎన్న‌టికి మ‌ర‌చిపోను. ఒక వేళ నేను క‌నుక ఈ విశ్వంతో మాట్లాడే అవ‌కాశం ఉంటే.. అవార్డు, అవార్డు కాస్త గ్యాప్ ఇవ్వ‌మ్మా అని చెబుతా. అప్పుడే విజ‌యాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించే అవ‌కాశం ఉంటుంది."అని రాజ‌మౌళి ట్వీట్ చేశారు. త‌న అన్న‌య్య‌కు ప‌ద‌శ్రీ రావ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు.

'ఆర్ఆర్ఆర్' చిత్రానికి ఎంఎం కీర‌వాణి సంగీతాన్ని అందించారు. 'ఆర్ఆర్ఆర్' ఘ‌న విజ‌యం సాధించ‌డంతో కీర‌వాణికి వ‌రుస‌గా అవార్డులు వ‌రిస్తున్నాయి. బోస్ట్ సోసైటి ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్‌, క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డు, లాస్ ఎంజెల్స్ పిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ అవార్డుల‌తో పాటు సినీ ప్రియులు ఎంతో ప్రతిష్టాత్మ‌కంగా బావించే 'గోల్డెన్ గ్లోబ్' అవార్డును కీర‌వాణి అందుకున్నారు. ఇప్ప‌టికే 'నాటు నాటు' పాట ఆస్కార్ నామినేష‌న్‌లో చోటు ద‌క్కించుకుంది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే కీర‌వాణి కిరీటంలో ఆస్కార్ రూపంలో మ‌రో క‌లికితురాయి చేరడం ఖాయం.

Next Story