'మేడ్‌ ఇన్‌ ఇండియా'.. బిగ్‌ అప్డేట్‌ ప్రకటించిన రాజమౌళి

ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళికి భారత్‌లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మాంచి క్రేజ్‌ ఉంది. తాజాగా రాజమౌళి బిగ్‌ అప్డేట్‌ ప్రకటించారు.

By అంజి  Published on  19 Sept 2023 12:43 PM IST
SS Rajamouli, Made In India, INDIAN CINEMA

'మేడ్‌ ఇన్‌ ఇండియా'.. బిగ్‌ అప్డేట్‌ ప్రకటించిన రాజమౌళి 

ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళికి భారత్‌లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మాంచి క్రేజ్‌ ఉంది. తాజాగా రాజమౌళి బిగ్‌ అప్డేట్‌ ప్రకటించారు. అయితే అది తాను దర్శకత్వం వహిస్తున్న మహేష్‌ బాబుకు సినిమాకు సంబంధించి కాదు.. తాను ప్రజెంట్‌ చేస్తున్న సినిమా గురించి. 'మేడ్‌ ఇన్‌ ఇండియా' అనే టైటిల్‌తో భారతీయ సినీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు జక్కన్న. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ని రాజమౌళి ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. భారతీయ సినిమా మూలాల గురించిన ప్రతిష్టాత్మకమైన హై బడ్జెట్ పీరియడ్ మూవీకి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సమర్పకుడిగా మారనున్నాడని గతంలో వార్తలు వచ్చాయి.

మేడ్ ఇన్ ఇండియా అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని తాజాగా రాజమౌళి ప్రకటించారు. “నేను మొదట ఈ కథ విన్నప్పుడు.. అది నన్ను భావోద్వేగంగా కదిలించింది. బయోపిక్‌ని రూపొందించడం చాలా కష్టం, కానీ భారతీయ సినిమా పితామహుడు గురించి ఆలోచించడం మరింత సవాలుతో కూడుకున్నది. మా అబ్బాయిలు దానికి సిద్ధంగా ఉన్నారు. అపారమైన గర్వంతో మేడ్ ఇన్ ఇండియా ప్రెజెంట్ చేస్తున్నాము" అని రాజమౌళి ట్వీట్ చేశారు.

అసలు భారతీయ సినిమా ఎక్కడ పుట్టింది? దాని ఆరిజిన్ ఏంటి? అనే కథతో భారతీయ సినిమా బయోపిక్‌గా 'మేడ్ ఇన్ ఇండియా' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని ఎస్‌ఎస్‌ కార్తికేయ, వరుణ్ గుప్తా కలిసి నిర్మించనున్నారు. రాజమౌళి ఈ సినిమాను ప్రజెంట్ చేస్తున్నాడు. మరి భారతీయ సినిమా బయోపిక్‌ని వరల్డ్ ఆడియన్స్ ముందుకి ఎలా ముందుకు తీసుకువెళ్తారో చూడాలి.

Next Story