కొడుకు బ్రాండ్ ప్రమోషన్ కోసం.. షారుఖ్ ఖాన్ ఏమి చేశాడంటే?

షారుఖ్ ఖాన్ తన కుమారుడు, ఆర్యన్ ఖాన్ లగ్జరీ దుస్తుల బ్రాండ్ 'డి'యావోల్' బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.

By అంజి  Published on  26 Feb 2024 9:32 AM IST
Shah Rukh Khan , Aryan, clothing brand, DYAVOL

కొడుకు బ్రాండ్ ప్రమోషన్ కోసం.. షారుఖ్ ఖాన్ ఏమి చేశాడంటే? 

షారుఖ్ ఖాన్ తన కుమారుడు, ఆర్యన్ ఖాన్ లగ్జరీ దుస్తుల బ్రాండ్ 'డి'యావోల్' బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఆ బ్రాండ్ ప్రమోషన్ కోసం షారుఖ్ ఖాన్ తన వంతు సహాయం చేస్తున్నాడు. షారుఖ్ ఖాన్ చొక్కా లేకుండా తాజా ప్రకటనలో చూపించాడు. మేనేజర్, పూజా దద్లానీ, షారుఖ్ కొత్త ప్రకటనను పంచుకున్నారు. షారుఖ్ ఖాన్ అద్భుతమైన ఫిట్‌నెస్ తో ఉన్నారని చెప్పారు. అంతేకాకుండా షారుఖ్ ఖాన్ రివర్స్ ఏజింగ్ అని సోషల్ మీడియాలో రాశారు. వైరల్ ఫోటోలో, షారుఖ్ ఖాన్ తన చేతిలో డ్రింక్ గ్లాసుతో 'పఠాన్' లుక్‌లో కనిపించారు. స్టైలిష్ సన్ గ్లాసెస్, చైన్‌లు, బ్రాస్‌లెట్స్, 'DYAVOL' అని అక్షరాలతో ఉన్న మూడు ఉంగరాలు ధరించారు. D'Yavol X అనేది ఆర్యన్ ఖాన్ లగ్జరీ దుస్తుల బ్రాండ్.

షారూఖ్ ఖాన్ 2023 లో మూడు సినిమాలను అందించాడు. రెండు బ్లాక్ బస్టర్స్ గా నిలవగా.. ఒకటి యావరేజ్ గా నిలిచింది. 2023 సంవత్సరం షారుఖ్ ఖాన్ కు కంబ్యాక్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. ఆ సంవత్సరం 'పఠాన్' హిట్ తో ప్రారంభమైంది, ఆ తర్వాత 'జవాన్' ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన 'డుంకీ'తో 2023ని షారుఖ్ ఖాన్ ముగించాడు.

Next Story