ఆకట్టుకుంటున్న 'శ్రీవల్లి' సాంగ్ ప్రోమో

Srivalli Song pomo out.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న చిత్రం పుష్ప‌. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Oct 2021 2:26 PM IST
ఆకట్టుకుంటున్న శ్రీవల్లి సాంగ్ ప్రోమో

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న చిత్రం 'పుష్ప‌'. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్ని స‌ర‌సన ర‌ష్మిక మందాన న‌టిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం నుంచి విడుద‌లైన తొలి పాట 'దాక్కో దాక్కో మేక' కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. నిన్న‌టి వ‌ర‌కు ఈ పాట 80 మిలియన్ల‌కు పైగా వ్యూస్ సాధించింది. రెండో పాట‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం వెల్ల‌డించిన‌ప్ప‌టికి నుంచి అభిమానులు ఆ పాట కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా రెండో సాంగ్ ప్రొమోను విడుద‌ల చేశారు.

'చూపే బంగారమాయెనే శ్రీవల్లి' అంటూ 20 సెక‌న్ల పాటు సాగిన పాట ప్రొయో అంచ‌నాల‌ను మ‌రింత పెంచేసింది. ఈ పాట‌ను సిద్ శ్రీరామ్ ఆల‌పించారు. శ్రీవల్లి పూర్తి పాట రేపు ఉదయం 11:07 గంటలకు విడుదల చేయ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో చిత్ర బృందం వెల్ల‌డించింది.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిమైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. మలయాళ న‌టుడు ఫహద్ ఫాసిల్ విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర తొలి భాగం 'పుష్ప ది రైజ్' డిసెంబర్ 17, 2021న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story