'చూపే బంగారమాయనే శ్రీవల్లి' .. మెలోడియస్ ఫీలింగ్‌

Srivalli song out from Pupsha.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న చిత్రం 'పుష్ప‌'. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Oct 2021 11:41 AM IST
చూపే బంగారమాయనే శ్రీవల్లి .. మెలోడియస్ ఫీలింగ్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న చిత్రం 'పుష్ప‌'. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్ని స‌ర‌సన ర‌ష్మిక మందాన న‌టిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం నుంచి విడుద‌లైన తొలి పాట 'దాక్కో దాక్కో మేక' కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ పాట ఇప్ప‌టికే 80 మిలియన్ల‌కు పైగా వ్యూస్ సాధించింది. రెండో పాట‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం వెల్ల‌డించిన‌ప్ప‌టికి నుంచి అభిమానులు ఆ పాట కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. నిన్న తాజాగా రెండో సాంగ్ ప్రొమో 'చూపే బంగారమాయెనే శ్రీవల్లి' విడుద‌ల చేయ‌గా.. నేడు పూర్తి పాట‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది.

దేవీ శ్రీప్ర‌సాద్ సంగీతం అందించ‌గా.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సిద్ శ్రీరామ్ ఆలపించగా.. హిందీలో జావేద్ అలి పాడారు. చంద్రబోస్ పాటకు సాహిత్యం అందించారు. ఈ పాట ఎంతో బాగుంది.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిమైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. మలయాళ న‌టుడు ఫహద్ ఫాసిల్ విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర తొలి భాగం 'పుష్ప ది రైజ్' డిసెంబర్ 17, 2021న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story