కేజీఎఫ్ 2 : రీనా దేశాయ్ లుక్ విడుద‌ల

Srinidhi Shetty look released from KGF 2 movie.సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో కేజీఎఫ్ 2

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Oct 2021 11:36 AM GMT
కేజీఎఫ్ 2 : రీనా దేశాయ్ లుక్ విడుద‌ల

సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'కేజీఎఫ్ 2' చిత్రం ఒక‌టి. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రాక్‌స్టార్ య‌శ్ హీరోగా తెర‌కెక్కిన 'కేజిఎఫ్ చాప్టర్ 1' సినిమా ఎంత‌టి ప్ర‌భంజ‌నాన్ని సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. కేజీఎప్ పార్టు 1 చిత్రంలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టి రెండవ భాగంలో కూడా న‌టిస్తోంది. నేడు ఆమె 28వ వ‌సంతంలోకి అడుగుపెడుతోంది. ఈ సంద‌ర్భంగా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ.. కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. రెండో భాగంలో ఆమె రీనా దేశాయ్ పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

'మా కిల్ లేడీ శ్రీనిధి శెట్టి అలియాస్‌ రీనా దేశాయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. కేజిఎఫ్ చాప్టర్ 2లో రీనా ఏమి తీసుకువస్తుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. ప్రేమ, క్రూరత్వం, వాట్ నాట్ ?' అంటూ ట్వీట్ చేసింది. కొత్త పోస్ట‌ర్‌లో ట్రెడిషనల్ లుక్ లో శ్రీనిధి శెట్టి అదిరిపోయింది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇక ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story
Share it