ఆకట్టుకుంటున్న 'శ్రీదేవి సోడా సెంటర్' ట్రైలర్

Sridevi Soda Center Trailer release.యంగ్ హీరో సుధీర్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Aug 2021 6:07 AM GMT
ఆకట్టుకుంటున్న శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్

యంగ్ హీరో సుధీర్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ప‌లాస 1978 ఫేమ్ క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు స‌ర‌స‌న ఆనంది హీరోయిన్‌గా న‌టిస్తోంది. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగ‌స్టు 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేసింది. అందులో భాగంగా నేడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు చేతుల మీదుగా ట్రైల‌ర్ విడుద‌ల చేయించింది చిత్ర‌బృందం.

ఈ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటుంది. హీరో జైలు నుంచి బయటకు రావడం, తరువాత హీరోయిన్ తో ప్రేమాయణం, అది వారి ఇంట్లో తెలియడం, ఊర్లో కొంతమంది ప్రమేయంతో హీరోహీరోయిన్ల ప్రేమను విడగొట్టడంతో ఎమోషనల్ యాంగిల్, హీరోను జైలుకు పంపడం, అతను అక్కడి నుంచి వచ్చాక తన ప్రేమను విడదీసిన వారిపై పాగా తీర్చుకోవడంతో రివేంజ్, ఇక ఫన్, లవ్ ఇలా అన్ని ఎమోషన్స్ కలగలిపి షడ్రుచుల సమ్మెళనంగా సినిమా ఉంటుంది అంటూ రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ లోనే చెప్పేశారు. ఈ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది.

Next Story