సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ ఓ 'గే' అంటున్న శ్రీరెడ్డి..!

Sri Reddy sensational comments on Samantha Stylist.అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత తాము విడిపోతున్నామంటూ ప్ర‌క‌టించిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Oct 2021 7:33 AM GMT
సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ ఓ గే అంటున్న శ్రీరెడ్డి..!

అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత తాము విడిపోతున్నామంటూ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. వారు విడిపోవ‌డానికి గ‌ల కార‌ణాలు వెల్ల‌డించలేదు. దీంతో వీరి విడాకుల వ్య‌వ‌హారంపై ఎవ‌రికి తోచిన విధంగా వారు కామెంట్లు చేస్తున్నారు. స‌మంత‌దే త‌ప్పు అని కొంద‌రు అంటుండ‌గా.. కాదు చైతు దే త‌ప్పు అని మ‌రికొంద‌రు అంటున్నారు. వీరి విడాకుల‌ వ్య‌వ‌హారంపై సోష‌ల్ మీడియాలో రోజుకో వార్త వ‌స్తూనే ఉంది. ఎక్కువ‌గా.. ఈ ఇద్దరు విడిపోవ‌డానికి కారణం సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో ఎఫైర్ అనే వార్త‌లు వినిపించాయి. ఇందుకు కారణం లేకపోలేదు. సమంత ప్రీతమ్ జుకల్కర్ ఒడిలో కాళ్ళు పెట్టుకుని పడుకుని ఉన్న ఫోటాను గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తరువాత వెంటనే డిలీట్ చేసింది.

కాగా.. దీనిపై ప్రీతమ్ జుకల్కర్ స్పందిస్తూ.. సమంత నాకు అక్కలాంటిది అని చైతుకి కూడా ఆ విషయం తెలుసు అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఇదే విషయంపై సంచలన నటి శ్రీరెడ్డి స్పందించారు. సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ ఓ "గే" అంటూ శ్రీ రెడ్డి వ్యాఖ్య‌లు చేసింది. అందుకే ప్రీతంతో ఇబ్బంది లేదనే ఉద్దేశంతోనే సమంత అతడితో స్నేహం చేసి ఉండొచ్చని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. తనకు తెలిసిన సమాచారం మేరకు ప్రీతం ఒక గే కాబట్టి అతడితో సమంతకు ఎఫైర్ ఉండే అవకాశమే లేదని శ్రీరెడ్డి కుండబద్ధలు కొట్టి మరీ చెబుతోంది. ప్ర‌స్తుతం శ్రీరెడ్డి వ్యాఖ్య‌లపై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది.

Next Story
Share it