బుద్ది గడ్డితినింది.. క్షమించండి అంజనమ్మా
Sri Reddy Apologizes Chiranjeevi mother Anjanamma.శ్రీరెడ్డి అంటే తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో.
By తోట వంశీ కుమార్ Published on 23 Jan 2022 3:24 PM ISTశ్రీరెడ్డి అంటే తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. పెద్ద నటి కాకపోయినప్పటికీ.. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌తో రచ్చ చేసి.. ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. కొంతమంది ఆమెను కాంట్రవర్సీ క్వీన్ అని కూడా పిలుస్తుంటారు. ఫిలిం ఛాంబర్ ముందు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ కి బాధితులైన ఆడవాళ్ళకి న్యాయం చేయాలి అంటూ గొడవ చేస్తూ సినీ ప్రముఖులందర్నీ తిట్టింది. ఇందులో భాగంగా చిరంజీవి తల్లిని కూడా అనరాని మాటలు అంది. ఇది జరిగి చాలా రోజులు అయ్యింది.
ఇక నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి.. ఈ సారి క్షమాపణలు చెప్పి మరీ వార్తల్లో నిలిచింది. అప్పట్లో చిరంజీవి అమ్మగారిపై చేసిన వ్యాఖ్యలకు తాజాగా క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియో పోస్టు చేసింది. ఆ వీడియోలో ఏం ఉందంటే.. ఆడవాళ్ల కోసం తాను చేసే ఉద్యమంలో న్యాయం కోసం ఓ పెద్ద మనిషి దగ్గరకు వెళ్లినట్లు చెప్పింది. ఆయన తన బ్రెయిన్ వాష్ చేసి.. ఆయన ఇచ్చిన సలహాతో చిరంజీవి గారి అమ్మ అంజనమ్మని తిట్టాల్సి వచ్చినట్లు పేర్కొంది. ఆ పెద్ద మనిషికి చిరంజీవికి ఎలాంటి తగాదాలు ఉన్నాయో తనకు తెలియదని చెప్పింది. ఈ ఇష్యూతో ఏమాత్రం సంబంధం లేని ఆవిడ్ని తిట్టడం ముమ్మాటికీ తప్పేనని.. అందుకు తాను శిక్ష కూడా అనుభవించినట్లు చెప్పుకొచ్చింది.
సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నట్లు పేర్కొంది. అలా ఎందుకు చేసానా అని ఇప్పటికీ బాధపడుతున్నా. అన్యాయంగా ఆమెను తిట్టడం తప్పు. ఒప్పుకుంటున్నాను. బుద్ది గడ్డి తిని అలా తిట్టాను. పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి అంజనమ్మా అంటూ ఆ వీడియోలో శ్రీరెడ్డి మాట్లాడింది. కాగా.. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఎప్పుడో జరిగిన ఈ సంఘటనని మళ్ళీ ఇప్పుడు గుర్తుచేయడమేంటో అని కొంతమంది కామెంట్ చేయగా.. మరికొందరు సదరు పెద్ద మనిషి ఎవరో చెప్పాలని అంటున్నారు. మరీ శ్రీ రెడ్డి కామెంట్లపై ఎవరన్నా స్పందిస్తారో లేదో చూడాలి.
నన్ను క్షమించండి "అంజనమ్మ" 🙏🙏🙏😭😭 pic.twitter.com/fnBvee9qRt
— Sri Reddy (@MsSriReddy) January 22, 2022