శ్రీకారం ఓటీటీలో వచ్చేస్తోంది.. డేట్ ఎప్పుడంటే..?

Sreekaram Movie OTT release date fix.శ్రీకారం సినిమా ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 April 2021 12:44 PM GMT
Sreekaram

'శ్రీకారం'.. శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రం రైతుల పరిస్థితిని వివరిస్తుంది. యంగ్ హీరో శ‌ర్వానంద్ మార్చి 19న 'శ్రీకారం' అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్రియా అరుళ్‌ మోహన్‌, సాయికుమార్‌, మురళీశర్మ, రావు రమేశ్‌, నరేశ్‌, ఆమని, సప్తగిరి, సత్య తదితరులు ముఖ్య పాత్ర‌లు పోషించ‌గా ఈ చిత్రాన్ని కిషోర్ తెర‌కెక్కించారు. రాబోయే కాలంలో రైతన్నవాడే లేకుండా పోతాడని.. తినడానికి తిండి కూడా లేకుండా బ్రతకాల్సి వస్తుందని.. రైతుగా మారితే ఉపాధి విషయంలో కూడా ఎటువంటి ఆటంకాలు రాకుండా పోతాయని తెలియజేస్తుంది. ఈ సినిమాను చూసిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. అయితే ఈ సినిమా థియేటర్లలో కలెక్షన్లు సాధించడంలో విఫలమైంది. పెద్దగా ప్రేక్షకులు సినిమా చూడడానికి ముందుకు రాలేదు.

ఇక తాజాగా సినిమా ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. సన్‌నెక్స్ట్‌ యాప్‌లో ఏప్రిల్‌ 16 నుంచి ప్ర‌సారం చేయ‌నున్నారు. థియేటర్లలో ఈ సినిమా చూడటం మిస్‌ అయిన వారు ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూడొచ్చు. తినేవాళ్లు నెత్తిమీద జుట్టంత సంఖ్యలో ఉంటే.. పండించే వాళ్లు మూతిమీద మీసం అంత కూడా లేరనే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఓటీటీలో అయినా మంచి పేరు తెచ్చుకుంటుందేమో చూడాలి.
Next Story