బ‌న్నికీ పోటీగా స్పైడ‌ర్ మ్యాన్‌

Spider Man No Way Home to compete with Pushpa.ఐకాన్ అల్లుఅర్జున్ న‌టిస్తున్న చిత్రం పుష్ప‌. సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Nov 2021 9:45 AM GMT
బ‌న్నికీ పోటీగా స్పైడ‌ర్ మ్యాన్‌

ఐకాన్ అల్లుఅర్జున్ న‌టిస్తున్న చిత్రం 'పుష్ప‌'. సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్ని స‌ర‌స‌న ర‌ష్మిక మందాన్నా న‌టిస్తోంది. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో పుష్ప‌రాజ్ అనే స్మ‌గ్ల‌ర్ పాత్ర‌లో బ‌న్ని క‌నిపించ‌నున్నాడు.మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేయబోతుండటం విశేషం. ఇప్పటికే రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన‌ సాంగ్స్‌కు భారీ స్థాయిలో ఆదరణ దక్కుతోంది. రెండు బాగాలుగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. తొలి భాగం డిసెంబ‌ర్ 17 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి నిన్నటి వరకు పోటీగా ఏ మూవీ లేదు. అయితే.. తాజాగా దీనికి గట్టి పోటీ ఇవ్వడానికి ఏకంగా హాలీవుడ్ చిత్రం రాబోతోంది. 'స్పైడర్ మ్యాన్ నో వే హోమ్' మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైల‌ర్ లో ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం తెలిపింది. ప్ర‌పంచంలోని ప్ర‌ధాన బాష‌లన్నింటిలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. మార్వెల్ శాండ్‌మ్యాన్, డాక్టర్ ఆక్టోపస్, ఎలక్ట్రో, గ్రీన్ గోబ్లిన్, లిజార్డ్, హాబ్‌ గోబ్లిన్‌లు కనిపించిన ఈట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక మ‌న‌దేశంలోనూ స్పైడ‌ర్ మ్యాన్‌కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నార‌నే విష‌యం తెలిసిందే. అందుకు గ‌తంలో స్పైడ‌ర్ మ్యాన్ చిత్రాలు సాధించిన భారీ క‌లెక్ష‌న్స్‌ నిద‌ర్శ‌నం.

కాగా.. పుష్ప మూవీకి ఇటు టాలీవుడ్‌లో గానీ, అటు మాలీవుడ్ లోకానీ ఎలాంటి నష్టం ఉండ‌క‌పోవ‌చ్చు..కాని హిందీ, తమిళ మార్కెట్లలో స్పైడర్ మాన్ గట్టిగా ప్రభావం చూపించే అవ‌కాశం ఉంద‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రీ బ‌న్ని ఏం చేస్తాడో చూడాలీ మ‌రి.

Next Story
Share it