రామారావు ఆన్ డ్యూటీ.. ఆక‌ట్టుకుంటున్న 'సొట్ట‌ల బుగ్గ‌ల్లో.. 'పాట‌

Sottala Buggallo Lyrical song released from RamaRao On Duty

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 May 2022 7:24 AM GMT
రామారావు ఆన్ డ్యూటీ.. ఆక‌ట్టుకుంటున్న సొట్ట‌ల బుగ్గ‌ల్లో.. పాట‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో పుల్ బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేతిలో నాలుగు చిత్రాలు ఉన్నాయి. అందులో ఒక‌టి 'రామారావు ఆన్ డ్యూటీ'. శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న దివ్యాంశ కౌశిక్‌, ర‌జిషా విజ‌య‌న్ న‌టిస్తున్నారు. సీనియ‌ర్ న‌టుడు వేణు తొట్టెంపూడి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మివెంక‌టేశ్వ‌రా సినిమాస్, ఆర్‌టి టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ల‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌, సింగిల్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేయ‌గా.. తాజాగా ఈ చిత్రం నుంచి 'సోట్ట‌ల బుగ్గ‌ల్లో రాసుకుపోతారా.. 'అనే పాట‌ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. హ‌రిప్రియా, న‌కుల్ అభ్యంక‌ర్ ఆల‌పించిన ఈ పాట‌కు క‌ళ్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి సాహిత్యం అందించారు. అంద‌మైన ఈ మెలోడి పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. నాజ‌ర్‌, న‌రేష్‌, ప‌విత్రా లోకేష్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రాన్ని జూన్ 17 ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు చిత్రం బృందం స‌న్నాహాకాలు చేస్తోంది.

Next Story