IMDBలో సూర్య సినిమా జోరు.. టాప్ 3లో చోటు

Soorarai pottru Biggest Feat On IMDB. తాజాగా సూరారై పోట్రు చిత్రం ఓ అరుదైన ఘ‌న‌తను సొంతం చేసుకుంది. ప్రముఖ మూవీ రేటింగ్​ సంస్థ ఐఎమ్​డీబీ( IMDB) సినిమాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 May 2021 12:48 PM IST
Soorarai pottru

త‌మిళ న‌టుడు సూర్య‌కి త‌మిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. ఆయ‌న న‌టించిన సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుద‌ల అవుతుంటాయి. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన చిత్రం సూరారై పోట్రు. సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు ఆకాశం నీ హ‌ద్దురా పేరుతో విడుద‌ల చేశారు. ఎయిర్ ద‌క్క‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు జీఆర్ గోపినాథ్ జీవిత క‌థ ఆధారంగా ఈచిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న అప‌ర్ణ బాల‌ముర‌ళి న‌టించింది.

రూపాయికే విమాన ప్ర‌యాణాన్ని అందించిన ఓ సామాన్య వ్య‌క్తి క‌థ‌తో రూపొందించిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం ఓ అరుదైన ఘ‌న‌తను సొంతం చేసుకుంది. ప్రముఖ మూవీ రేటింగ్​ సంస్థ ఐఎమ్​డీబీ( IMDB) సినిమాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ సినీ చరిత్రలో గొప్ప చిత్రాలుగా పేరొందిన 'ది షాషంక్ రిడెంప్షన్', 'ది గాడ్ ఫాదర్' తర్వాత స్థానం సాధించి రికార్డు సృష్టించింది.

ఈ చిత్రంలో మోహన్‌బాబు పైలెట్‌గా తన సొంత పేరుతో భక్తవత్సలం నాయుడుగా నటించారు. పరేష్‌ రావల్‌, ఊర్వశి, కరుణాస్‌, వివేక్ ప్రసన్న తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీత స్వరాలు సమకూర్చారు. నికేత్‌ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా సతీష్‌ సూర్య ఎడిటర్‌ పనిచేశారు. గునీత్ మొంగా నిర్మాత.


Next Story