తమ కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తాయని, త్వరలోనే అన్నీ పరిష్కారం అవుతాయని మంచు విష్ణు తెలిపారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించడం తగదని అన్నారు. భారి సెక్యూరిటీ మధ్య మంచు విష్ణు తన ఇంటికి వెళ్లారు. మోహన్ బాబు, మనోజ్ మధ్య వివాదం జరగగా, ఇరువురూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
తనకు ముప్పు పొంచి ఉంది, రక్షణ కల్పించాలని మోహన్ బాబు వాట్సాప్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై కొడుకు మనోజ్, కోడలు మౌనికపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. తనపై దాడి చేశారని, ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్‌బాబుకు చెందిన 10 మంది అనుచరులపై పహాడిషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తన భార్యపై మోహన్ బాబు తప్పుడు ఆరోపణలు చేశారని మంచు మనోజ్ మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలు గురించి ప్రస్తావిస్తున్నందుకు తనకు చాలా బాధగా ఉందన్నారు.