రియల్ హీరో సోనూసూద్‌కు కరోనా
Sonusood tests corona positive.ప్రముఖ బాలీవుడ్ నటుడు, రియల్ హీరో సోనూసూద్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థరాణ అయ్యింది.
By తోట వంశీ కుమార్ Published on
17 April 2021 8:52 AM GMT

ప్రముఖ బాలీవుడ్ నటుడు, రియల్ హీరో సోనూసూద్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థరాణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని.. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తానని.. దీని వల్ల మీ సమస్యలను తీర్చడానికి మరికొంత సమయం దొరుకుంతుందని అన్నారు సోనూసూద్.
ఈ ఉదయం నాకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లోకి వెళ్లాను. తగిన జాగ్రత్తలు పాటిస్తున్నాను. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనివల్ల మీ సమస్యలను తీర్చడానికి నాకు మరికొంత సమయం దొరుకుతుంది. గుర్తు పెట్టుకోండి. మీకోసం నేను ఉన్నాను అని సోనూసూద్ ట్వీట్ చేశారు. ఇటీవల సంజీవని అనే కోవిడ్ టీకా డ్రైవ్‌ను ప్రారంభించిన సోనూసూద్.. అందులో భాగంగా ఫస్ట్ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్నాడు. అయినప్పటికీ ఆయనకు కరోనా సోకడం గమనార్హం.
Next Story