సోనూసూద్‌ను కలిసేందుకు ఎవరూ చేయని సాహసం
Sonu Sood's fan padayatra from hyderabad to mumbai.కరోనా కష్టకాలంలో నేనున్నానంటూ ముందుకు వచ్చిన రియల్
By తోట వంశీ కుమార్ Published on 11 Jun 2021 1:39 AM GMTకరోనా కష్టకాలంలో నేనున్నానంటూ ముందుకు వచ్చిన రియల్ హీరో బాలీవుడ్ నటుడు సోనూసూద్. కష్టాల్లో ఉన్న వారికి చేతనైన సాయం చేస్తూ.. వారి కన్నీళ్లు తుడుస్తూ.. వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నాడు. ఆక్సిజన్ అందక పలువురు మరణించిన ఘటనలు కలిచి వేయడంతో.. ఎక్కడిక్కడ ఆక్సిజన్ ప్లాంట్‌లు, ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి సేవ చేస్తున్నాడు. ఇంతలా ప్రజల కష్టాలను తన కష్టాలు అని అనుకుంటున్నాడు కనుకే అతడికి రోజు రోజుకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. అతనికి గుడులు కట్టి పూజలు చేస్తున్నారు. సోనూ సూద్ కార్యక్రమాలతో ఉత్తేజం పొందిన తెలంగాణలోని వికారాబాద్ కు చెందిన వెంకటేష్ అనే యువకుడు ఇంతవరకు అతని కోసం ఎవరూ చేయసి సాహసం చేశాడు.
సోనూసూద్‌ను కలవడానికి వికారాబాద్‌నుంచి ముంబయికి దాదాపు 700 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్ళాడు. సోనూ సూద్ పోటోతో ఉన్న ప్లకార్డు చేతపట్టి ఛలో ముంబై అంటూ బయలుదేరాడు. 'రియల్ హీరో సోనూ సూద్.. టైటిల్ కింద నా గమ్యం.. నా గెలుపు ట్యాగ్ లైన్ తో..హైదరాబాద్ నుంచి ముంబైకి పాదయాత్ర అని రాసిన ప్లకార్డుతో పాదయాత్ర' చేశాడు. లాక్‌డౌన్ కారణంగా ఎంతో శ్రమకోర్చి ముంబైకి చేరుకున్నాడు. అయితే పాదయాత్ర సమయంలో మీడియాతో మాట్లాడిన వెంకటేష్ .. లాక్‌డౌన్ కారణంగా నా తండ్రి నెలవారీ ఈఎంఐ చెల్లించలేకపోయాడు. దీని వలన ఫైనాన్స్ వారు నా తండ్రి ఆటోని స్వాధీనం చేసుకున్నారు. దీని వలన నా తండ్రి మానసికంగా కుంగిపోయారు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయాను. ఇప్పుడు తండ్రిని కోల్పోవాలని అనుకోవడం లేదు. అందుకే సోనూసూద్ సాయం కోసం పాద్రయాత్రగా బయలు దేరాను అని వెంకటేష్ పేర్కొన్నారు.
Venkatesh, walked barefoot all the way from Hyd to Mumbai to meet me, despite me making efforts to arrange some sort of transportation for him. He is truly inspiring & has immensely humbled me
— sonu sood (@SonuSood) June 10, 2021
Ps. I, however, don't want to encourage anyone to take the trouble of doing this, ❣️ pic.twitter.com/f2g5wU39TM
తన కోసం కాలినడకన 700 కిలోమీటర్లు నడుస్తూ వస్తున్న అభిమాని కోసం సోనూసూద్ స్వయంగా ఇంటి గేటు వద్దకు వచ్చాడు. వచ్చీ రావడంతోనే తన కాళ్లకు దండం పెట్టిన అభిమాని వెంకటేష్ ను వారించి అక్కున చేర్చుకున్నాడు. ఎందుకింత కష్టపడ్డావంటూ చలించిపోయాడు. అతనితో ఫోటో దిగాడు. అంతే కాక దయచేసి ఎవ్వరూ ఇలాంటి పనులు చేయొద్దు అని సోనూ సూద్ కోరారు. ఇక ఆ యువకుడికి సోనూ అండగా ఉంటానని హామీ ఇచ్చినట్టు సమాచారం. వికారాబాద్ జిల్లా నుంచి జూన్ 1న పాదయాత్ర ప్రారంభించిన వెంకటేశ్ పదో రోజున ముంబై చేరారు.