సోనూసూద్‌పై నార్త్ రైల్వే మండిపాటు.. త‌ప్పుడు సందేశాలివ్వొద్దు

Sonu Sood Slammed For Travelling On Footboard Of Train. ఎంద‌రికో సాయం చేసి రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jan 2023 1:12 PM IST
సోనూసూద్‌పై నార్త్ రైల్వే మండిపాటు.. త‌ప్పుడు సందేశాలివ్వొద్దు

క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎంద‌రికో సాయం చేసి రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు బాలీవుడ్ న‌టుడు సోనూసూద్‌. అయితే.. ఇటీవ‌ల ఆయ‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. సోనూసూద్ రైలులో ప్ర‌యాణిస్తున్న వీడియో అది. రైలులో డోరు ద‌గ్గ‌ర ఫుట్‌బోర్డుపై కూర్చుని బ‌య‌ట‌కు చూస్తున్నాడు సోనూ ఆ వీడియోలో. దీనిపై ప‌లువురు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

దీనిపై నార్త‌న్ రైల్వే స్పందించింది. సోనూసూద్ ఇలా ఫుట్‌బోర్డు ప్ర‌యాణం చేయ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అనేక మందికి రోల్ మోడ‌ల్ అయిన సోనూ ఇలా ప్ర‌మాద‌క‌ర‌మైన చ‌ర్య‌లు చేయ‌డం స‌రికాదంటూ పేర్కొంది. ఈ వీడియోతో అస‌లు సోనూ దేశానికి ఏ సందేశం ఇవ్వాల‌ని అనుకుంటున్నారు అని మండిప‌డింది.

సోనూసూద్‌.. మీకు ఈ దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. మీరు వారంద‌రికి రోల్ మోడ‌ల్‌. రైలు మెట్ల ద‌గ్గ‌ర ప్ర‌యాణించ‌డం ప్ర‌మాద‌క‌రం. ఈ ర‌క‌మైన వీడియో మీ అభిమానుల‌కు త‌ప్పుడు సందేశాన్ని చేర‌వేయ‌వ‌చ్చు. ద‌య‌చేసి ఇలాచేయకండి. సాఫీగా, సుర‌క్షిత‌మైన ప్ర‌యాణం చేస్తూ ఎంజాయ్ చేయండి అని నార్త‌న్ రైల్వే ట్వీట్ చేసింది.

ఈ వీడియోపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై తాజాగా సోనూసూద్ స్పందించాడు. క్ష‌మాప‌ణ‌లు తెలిపాడు. రైలు డోరు వ‌ద్దే మ‌గ్గిపోతున్న పేద‌ల జీవితాల‌ను అర్థం చేసుకునేందుకు అక్క‌డ కూర్చున్న‌ట్లు తెలిపారు. రైల్వే వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగుప‌రిచినందుకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు.

Next Story