10 గుడ్లు కొంటే.. ఓ బ్రెడ్డు ఫ్రీ అంటున్న సోనుసూద్
Sonu Sood sells anda-bread on cycle to promote small businesses.బాలీవుడ్ నటుడు సోనుసూద్ దేశ ప్రజల్లో రియల్ హీరోగా
By తోట వంశీ కుమార్ Published on 25 Jun 2021 10:09 AM ISTబాలీవుడ్ నటుడు సోనుసూద్ దేశ ప్రజల్లో రియల్ హీరోగా అవతరించిన సంగతి తెలిసిందే. కొవిడ్-19 విషయంలో అతను ఎంతో దాతృహృదయంతో వ్యవహరించిన తీరు నటుడిగా కంటే గొప్ప మానవతావాదిగా గుర్తింపునిచ్చింది. కరోనా మొదటి వేవ్ లో అతడి సాయం అసమానమైనది. సెకెండ్ వేవ్ లోనూ అతడి సాయం ఎక్కడా తగ్గలేదు. మొదటి వేవ్ ని మించి అతను ఇప్పుడు మరింతగా సేవలందిస్తున్నారు. ఖరీదైన మందులు ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిలో బెడ్లు ఏర్పాటు చేయడం వంటివి ఎన్నో చేసారు. కొందరు నేరుగా ముంబైలోని సోనుసూద్ ఇంటికెళ్లి తమ కష్టాలను, బాధలను విన్న వించుకుంటే వాటిని పరిష్కరించారు.
ఇదిలా ఉంటే..తాజాగా సోనుసూద్ సైకిల్‌పై బ్రెడ్లు, గుడ్లు అమ్ముతూ కనిపించారు. సైకిల్ మీద గుడ్లు, బ్రెడ్లు, పావ్‌తో పాటు మరికొన్ని సరుకులు ఉన్నాయి. ఈ సైకిల్ ను సూపర్ మార్కెట్‌గా అభివర్ణించారు సోను. అంతేకాదండోయ్ 10 గుడ్లు కొంటే.. ఓ బ్రెడ్డు ఫ్రీ అని ఆఫర్ కూడా ప్రకటించాడు. ఇక హోమ్ డెలివరీ అయినా పూర్తిగా ఉచితం అని చెబుతున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే..ఇది ఏదో షూటింగ్ కోసం అనుకుంటే మీరు పొరబడినట్లే. చిరు వ్యాపారులను ప్రోత్సహించమని చెప్పేందుకు సోనుసూద్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.