బిగ్ డే.. మరో ప్రాణాన్ని నిలబెట్టిన సోనుసూద్
Sonu Sood saves Another Child Life.కరోనా కష్టకాలం నుంచి మొదలైన బాలీవుడ్ నటుడు సోనుసూద్ సేవలు నేటికి
By తోట వంశీ కుమార్ Published on
9 Sep 2021 8:32 AM GMT

కరోనా కష్టకాలం నుంచి మొదలైన బాలీవుడ్ నటుడు సోనుసూద్ సేవలు నేటికి కొనసాగుతున్నాయి. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తున్నారు. తాజాగా మరో ప్రాణాన్ని నిలబెట్టారు సోనుసూద్. ఓ చిన్నారికి కాలేయ మార్పిడి, గుండె శస్త్ర చికిత్స చేయించారు. బాలుడి కుటుంబ సభ్యులు సోనుసూద్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
'మీ మద్దతు వలన.. శుభమ్ కాలేయ మార్పిడి, గుండె శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి అయ్యింది. హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. మీ సహాయానికి ధన్యవాదాలు' అంటూ బాలుడి కుటుంబ సభ్యులు ట్వీట్ చేయగా.. దీనిపై సోనుసూద్ స్పందించారు.
'బిగ్ డే.. ఈ మధ్య కాలంలో చాలా క్లిష్టమైన కాలేయ మార్పిడి, గుండె శస్త్రచికిత్స ఒకటి సూపర్ సక్సెస్. సర్వశక్తిమంతుడికి ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశారు.
Next Story