కాపాడతాన‌నుకున్నా.. కానీ.. సోనూసూద్ భావోద్వేగం

Sonu sood emotional tweet after bharati death.క‌రోనా కష్ట‌కాలంలో వ‌ల‌స కూలీల‌కు అండ‌గా నిల‌బ‌డి రియ‌ల్ హీరో అయ్యాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 May 2021 12:24 PM IST
కాపాడతాన‌నుకున్నా.. కానీ.. సోనూసూద్ భావోద్వేగం

క‌రోనా కష్ట‌కాలంలో వ‌ల‌స కూలీల‌కు అండ‌గా నిల‌బ‌డి రియ‌ల్ హీరో అయ్యాడు బాలీవుడ్ న‌టుడు సోనూసూద్‌. ఇప్ప‌టికి కూడా అడిగిన వారికి లేద‌నకుండా త‌న వంతు సాయం చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఈ న‌టుడు బావోద్వేగానికి గుర‌య్యాడు. క‌రోనాతో పోరాడుతున్న ఓ యువ‌తి ప్రాణాన్ని కాపాడ‌డానికి ఎంతో ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికి.. చివ‌రికి కాపాడ‌లేక‌పోయానంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ ఓ ట్వీట్ చేశాడు సోనూసూద్.

ఇటీవ‌ల‌.. నాగ్‌పూర్‌కు చెందిన భార‌తి అనే యువ‌తి కొవిడ్ బారిన ప‌డింది. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఆమె ఊపిరితిత్తులు 85 శాతం మేర దెబ్బ‌తిన్నాయి. మెరుగైన వైద్యం అందించాల‌ని లేదా ఊపిరితిత్తులు మార్చాల‌ని డాక్ట‌ర్లు చెప్పారు. ఈ విష‌యం సోనూసూద్ తెలిసింది. వెంట‌నే ఆమె కోసం ప్ర‌త్యేక‌ ఎయిర్ అంబులెన్స్ ను ఏర్పాటు చేయించి హైద‌రాబాద్‌కు తీసుకువ‌చ్చారు. కొద్ది రోజులుగా భార‌తికి హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స జ‌రుగుతుంది. కొద్ది రోజులుగా చికిత్స అందుతుండ‌గా.. శుక్ర‌వారం ఆమె ప‌రిస్థితి విష‌మించ‌డంతో మృతి చెందింది.

'నెల రోజుల పాటు జీవిత పోరాటం చేసిన ఆమెకు నా సంతాపం తెలియ‌జేస్తున్నాను. ఆమెను బతికిస్తానని ఎంతో అనుకున్నాను. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఊహించలేం. నా హృదయం ముక్కలైంది' అని సోనూసూద్ త‌న ట్వీట్ లో తెలిపారు.


Next Story