ఉచితంగా ఐఏఎస్ శిక్ష‌ణ

Sonu Sood announces free coaching for IAS aspirants.క‌రోనా క‌ష్ట‌కాలంలో నేనున్నానంటూ ముందుకు వ‌చ్చిన రియ‌ల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jun 2021 2:37 PM IST
ఉచితంగా ఐఏఎస్ శిక్ష‌ణ

క‌రోనా క‌ష్ట‌కాలంలో నేనున్నానంటూ ముందుకు వ‌చ్చిన రియ‌ల్ హీరో బాలీవుడ్ న‌టుడు సోనూసూద్‌. క‌ష్టాల్లో ఉన్న వారికి చేత‌నైన సాయం చేస్తూ.. వారి క‌న్నీళ్లు తుడుస్తూ.. వెన్నుత‌ట్టి ప్రోత్స‌హిస్తున్నాడు. ఆక్సిజ‌న్ అంద‌క ప‌లువురు మ‌ర‌ణించిన ఘ‌ట‌న‌లు క‌లిచి వేయ‌డంతో.. ఎక్క‌డిక్క‌డ ఆక్సిజ‌న్ ప్లాంట్‌లు, ఆక్సిజ‌న్ బ్యాంకులు ఏర్పాటు చేసి సేవ చేస్తున్నాడు. ఎంద‌రిలో ఉద్యోగాలు క‌ల్పించాడు. ఇంత‌లా ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను త‌న క‌ష్టాలు అని అనుకుంటున్నాడు క‌నుకే అత‌డికి ఎంతో మంది అభిమానులుగా మారారు. అత‌నికి గుడులు క‌ట్టి పూజ‌లు చేస్తున్నారు.

ఇక తాజాగా సోనూసూద్‌.. సివిల్ స‌ర్వీసెస్‌లో చేరానుకునే వారికి అండ‌గా నిల‌వాల‌ని అనుకుంటున్నారు. సంభ‌వం పేరుతో వారికి ఆర్థికంగా స‌హ‌క‌రించేందుకు ముందుకొచ్చారు. సివిల్ స‌ర్వీసెస్ కు సిద్దం అవుతున్న విద్యార్థుల‌కు విద్యార్థుల‌కు ఉప‌కార వేత‌నాలు ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు. 'ఐఏఎస్ కోసం సిద్దం కావాల‌నుకుంటున్నారా..? మీ బాధ్య‌త మేం తీసుకుంటాం. సంభ‌వం ప్రారంభం గురించి ప్ర‌క‌టిస్తున్నందుకు థ్రిల్లింగ్‌గా ఉంది' అని సోనూసూద్ ట్వీట్ చేశారు.

ఉప‌కార వేత‌నం పొందేందుకు ద‌ర‌ఖాస్తుల గ‌డువు ఈ నెల 30తో ముగియ‌నున్న‌ట్లు తెలుస్తోంది.


Next Story