'సన్ ఆఫ్ ఇండియా' టీజర్.. మోహ‌న్ బాబు కసక్ అంటే అందరూ ఫసక్

Son of India Teaser out.కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా గ్యాప్ తర్వాత ఫుల్ లెంత్ రోల్ లో నటిస్తున్న చిత్రం సన్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jun 2021 10:07 AM GMT
సన్ ఆఫ్ ఇండియా టీజర్..  మోహ‌న్ బాబు కసక్ అంటే అందరూ ఫసక్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా గ్యాప్ తర్వాత ఫుల్ లెంత్ రోల్ లో నటిస్తున్న చిత్రం సన్ ఆఫ్ ఇండియా. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ - శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకాలపై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్ర టీజ‌ర్‌ని కొద్దిసేప‌టి క్రితంవిడుద‌ల చేశారు. 30ఏళ్ల క్రితం అసెంబ్లీ రౌడీ చిత్రాన్ని ఇదే రోజు విడుద‌ల‌చేయ‌గా.. స‌న్ ఆఫ్ ఇండియా టీజ‌ర్‌ను కూడా నేడే విడుద‌ల చేసి ఫ్యాన్స్‌కు ఆనందాన్నిఅందించారు మోహ‌న్ బాబు.

ఈ సినిమా టీజర్‌ను కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య రిలీజ్ చేయ‌గా, ఈ టీజ‌ర్ చిరు వాయిస్ ఓవ‌ర్‌తో మొద‌లు కావ‌డం విశేషం. 'మన అంచనాలకు అందని ఓ వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను' అంటూ మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ప్రారభమైంది. 'తన రూటే సపరేటు.. తను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో.. ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో.. ఆ దేవుడికే ఎరుక' అంటూ ఇందులో మోహన్ బాబు పాత్ర స్వభావాన్ని తెలియజేసారు. ఈ సినిమాలో డైలాగ్ కింగ్ విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నాడు. అంతేకాదు ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. అంతేకాదు ఒకప్పటి మోహన్ బాబును గుర్తు చేస్తున్నారు.

ఈ టీజర్ లో 'నేను చీకటిలో ఉండే వెలుతురిని.. వెలుతురులో ఉండే చీకటిని', 'నేను కసక్‌ అంటే మీరందరూ ఫసక్‌' అని మోహ‌న్ బాబు చెప్పే డైలాగ్స్ కూడా ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన 'ఓన్లీ వన్స్ ఫసక్' మాదిరిగా చివర్లో 'నేను కసక్ అంటే మీరందరూ ఫసక్' అని మోహన్ బాబు చెప్పడం గమనార్హం. ఈ చిత్రానికి ఇళ‌య‌రాజా సంగీత స్వ‌రాలు అందిస్తున్నారు.

Next Story