మానస్, సిరి ఔట్.. ఆ ముగ్గురిలో విజేత ఎవరంటే?
Siri and Maanas will be eliminated from Bigg Boss house.బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 కి శుభం కార్డు పడే సమయం
By తోట వంశీ కుమార్ Published on 19 Dec 2021 8:10 AM ISTబిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 కి శుభం కార్డు పడే సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో ఈ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ నేడు (ఆదివారం) ప్రసారం కానుంది. ఫినాలే ఎపిసోడ్‌ను కనీవినీ ఎరగని రీతిలో ప్లాన్ చేశారు నిర్వాహకులు. టాలీవుడ్ నుంచి స్టార్ సెలబ్రిటీలను స్పెషల్ గెస్టులుగా తీసుకొస్తుండటంతో పాటు బాలీవుడ్ స్టార్లను సైతం రంగంలోకి దింపారు. ప్రస్తుతం హౌస్‌లో టాప్-5 కంటెస్టెంట్స్.. వీజే సన్నీ, శ్రీరామచంద్ర, షణ్ముఖ్ జశ్వంత్, మానస్, సిరి ఉన్నారు. వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మానస్, సిరి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారని లీక్ వీరులు సోషల్ మీడియాలో చెప్పేశారు. ఇప్పటి వరకు వీరు చెప్పింది దాదాపుగా నిజం కావడంతో.. ఇది కూడా నిజమేనని నమ్ముతున్నారు కొంతమంది. ఇక వీజే సన్నీ, శ్రీరామచంద్ర, షణ్ముఖ్ జశ్వంత్‌లలో ప్రధానంగా సన్ని, జశ్వంత్ మధ్యే పోటి ఉందని అంటున్నారు. అనధికార ఓటింగ్ ప్రకారం చూసుకుంటే వీజే సన్ని 34శాతంతో టాప్ ప్లేసులో ఉన్నాడని తెలుస్తోంది. 31 శాతం ఓట్లతో షణ్ముఖ్ జశ్వంత్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడని అంటున్నారు. వీరిలో సన్నినే విజేతగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. మరీ ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే నేటి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వేచి చూడక తప్పదు.