పెళ్లికూతురైన సింగ‌ర్ సునీత‌.. ఫోటోలు వైర‌ల్‌

Singer Sunitha become Bride.పెళ్లికూతురైన సింగ‌ర్ టాలీవుడ్‌ సింగర్‌ సునీత వ్యాపార‌వేత్త‌ ‌రామ్‌ వీరపనేనితో నేడు వివాహాం జ‌ర‌గ‌నుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jan 2021 2:35 PM GMT
sunitha mehandhi function

టాలీవుడ్‌ సింగర్‌ సునీత వివాహాం నేడు వ్యాపార‌వేత్త‌ ‌రామ్‌ వీరపనేనితో జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆమె ఇంట మెహందీ ఫంక్షన్‌ జరిగింది. దీనికి సంబంధించిన ఫొటో, వీడియోలను ఆమె సోష‌ల్ మీడియాలో షేర్‌ చేశారు. ఈ వీడియోలో పసుపు చీరలో మెరిసిపోతున్న సునీత ముఖంలో పెళ్లి కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సునీత చేతులకు మెహందీ పెట్టుకుని సిగ్గుపడుతూ కనిపించారు. సునీత సంప్రదాయబద్ధంగా పెళ్లి కూతురు అయ్యింది. ఈ క్రమంలో ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి తన ఆనందాన్ని పంచుకుంది. ప్ర‌స్తుతం పెళ్లికూతురైన సునీత ఫోటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.


సునీత‌కు 19ఏళ్ల వ‌య‌సులోనే పెళ్ల‌యిన విష‌యం తెలిసిందే. ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టాక భ‌ర్త వేధింపులు భ‌రించ‌లేక ఆమె విడాకులు తీసుకున్నారు. ప్ర‌స్తుతం పిల్ల‌ల బాధ్య‌త‌ను ఆమే చూసుకుంటున్నారు. కొంత‌కాలంగా త‌న వ్య‌క్తిగ‌త జీవితంపై ఎన్నో పుకార్లు వ‌చ్చినా సునీత వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు.
Next Story
Share it