ప్ర‌ముఖ బాలీవుడ్ సింగ‌ర్ సోను నిగ‌మ్‌పై దాడి.. ఎమ్మెల్యే కుమారుడిపై కేసు న‌మోదు

Singer Sonu Nigam Attacked During An Event In Mumbai's Chembur.సెల్ఫీ అడిగితే ఇవ్వ‌లేద‌ని సింగ‌ర్ సోను నిగ‌మ్‌పై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Feb 2023 10:10 AM IST
ప్ర‌ముఖ బాలీవుడ్ సింగ‌ర్ సోను నిగ‌మ్‌పై దాడి.. ఎమ్మెల్యే కుమారుడిపై కేసు న‌మోదు

సెల్ఫీ అడిగితే ఇవ్వ‌లేద‌ని ప్ర‌ముఖ బాలీవుడ్ సింగ‌ర్ సోను నిగ‌మ్‌పై దాడి జ‌రిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో సోమ‌వారం ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సోను నిగ‌మ్ బృందంపై దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో సోను నిగ‌మ్ తో పాటు అత‌డి స్నేహితుడు, బాడీగార్డుకు గాయాలు అయ్యాయి. వీరిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

చెంబూర్‌లోని స‌బ‌ర్భ‌లో జ‌రిగిన ఓ మ్యూజిక్ ఈవెంట్‌లో ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డానికి సోను నిగ‌మ్ వ‌చ్చారు. ప్ర‌ద‌ర్శ‌న అనంత‌రం మెట్లు దిగి వ‌స్తుండ‌గా కొంద‌రు అనుచితంగా ప్ర‌వ‌ర్తించారు. ఎమ్మెల్యే ప్ర‌కాశ్ ఫ‌ట‌ర్‌పేక‌ర్ కుమారుడు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించార‌ని సోను ఆరోపించారు.

ఎమ్మెల్యే ప్రకాష్ కుమారుడు మెట్ల‌పై నుంచి సోను నిగ‌మ్ అండ్ టీమ్‌ని కింద‌కి తోసేశాడు. ముందుగా సోను నిగ‌మ్ ప‌క్క‌నే ఉన్న అత‌డి స్నేహితుడు ర‌బ్బానీ ఖాన్ ని మెట్ల పై నుంచి కింద ప‌డేశారు. ర‌బ్బానిని నెట్ట‌డంతో అల‌ర్ట్ అయిన సోను సెక్యూరిటీ ఇద్ద‌రికి కూడీ గాయాలు అయ్యాయి. దాడి చేసే వారిని ఆపేందుకు య‌త్నించ‌గా సోను నిగ‌మ్‌ని కూడా నెట్టేశారు.

కచేరీ ముగిసిన తర్వాత నేను స్టేజి దిగి వస్తుండగా స్వప్నిల్ ప్రకాష్ ఫాటర్‌పేకర్ అనే వ్యక్తి నన్ను పట్టుకున్నాడు. అప్పుడు నన్ను రక్షించడానికి వచ్చిన హరి మ‌రియు రబ్బానీని తోసాడు. అప్పుడు నేను మెట్ల మీద పడిపోయాను. వారు బ‌ల‌వంతంగా సెల్పీలు దిగాల‌ని య‌త్నించ‌డంతో పాటు గొడ‌వ పెట్టుకున్నారు. దీనిపై నేను ఫిర్యాదు చేశాను అని సోను నిగ‌మ్ తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story